Employee Leave: పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..

పండగవేళ అందరూ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఆరోజు ఆఫీసులకు లీవు పెడతారు. అలా లీవు కోరిన ఓ మహిళకు ఆ యాజమాన్యం ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసింది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో మండి పడుతున్నారు. పండుగకు సెలవు అడిగితే వీలైతే లీవ్ ఇవ్వాలి.. లేదా కుదరదని చెప్పాలి కానీ.. ఇలా ఉద్యోగంలోంచి తీసేస్తారా అంటూ మండిపడుతున్నారు.

Employee Leave: పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..

|

Updated on: Aug 17, 2024 | 12:12 PM

పండగవేళ అందరూ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఆరోజు ఆఫీసులకు లీవు పెడతారు. అలా లీవు కోరిన ఓ మహిళకు ఆ యాజమాన్యం ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసింది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో మండి పడుతున్నారు. పండుగకు సెలవు అడిగితే వీలైతే లీవ్ ఇవ్వాలి.. లేదా కుదరదని చెప్పాలి కానీ.. ఇలా ఉద్యోగంలోంచి తీసేస్తారా అంటూ మండిపడుతున్నారు.

పంజాబ్ లోని మొహాలీలో బి9 సొల్యూషన్స్ కంపెనీ ఉంది.. అందులో బబిన అనే మహిళ హెచ్చార్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కంపెనీ జారీ చేసిన ఇంటర్నల్ సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. వరుస సెలవులు రావడంతో ఆగస్టు 19న రక్షాబంధన్ అయినా తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని మేనేజ్ మెంట్ ఆర్డర్ వేసింది. ఆ రోజు డుమ్మా కొట్టినా, ఆలస్యంగా వచ్చినా ఏడు రోజుల జీతాన్ని కట్ చేస్తామని మేనేజ్ మెంట్ ఉద్యోగులను హెచ్చరించింది. దీనిపై హెచ్చార్ మేనేజర్ బబిన అభ్యంతరం చెప్పింది. ఒక్క రోజు సెలవుకు వారం రోజుల జీతం కట్ చేయడం అన్యాయమని, దీనికి తాను ఒప్పుకోబోనని వాదించింది. అయితే, ఈ వాదన బెడిసికొట్టి ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది. బబినను వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ఆమె బాస్ టెర్మినేషన్ లెటర్ పంపాడు. తోటి ఉద్యోగుల కోసం ఫైట్ చేస్తే తన ఉద్యోగమే ఊడిందంటూ బబిన ఈ ఉదంతాన్ని లింక్డ్ ఇన్ లో పోస్టు చేయగా.. నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

దీనిపై స్పందించిన సదరు కంపెనీ యామాన్యం…సింపతి కార్డు వాడి సోషల్ మీడియాలో బాధితురాలిగా సానుభూతి పొందడం సులభమని బబిన ఉదంతంపై బీ9 సొల్యూషన్స్ వివరణ ఇచ్చింది. బబిన ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ లెటర్ అందుకుందని, ఆ విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ఆఫీసులో ఫోన్ ఎక్కువగా వాడడం, వర్క్ టైంలో ఆన్ లైన్ కోర్సులు చేయడం, ఆఫీసు పని పక్కన పెట్టి కూతురు హోంవర్క్ చేస్తూ కూర్చోవడం.. ఇలాంటి పనులు చేస్తున్నందుకు బబినను చాలాసార్లు మందలించినట్లు కంపెనీ పేర్కొంది. తన విధులు పక్కన పెట్టి ఉద్యోగులతో కలిసి కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఆగస్టు 15 నుంచి 20 వరకు లాంగ్ పెయిడ్ లీవ్ లు పెట్టాలంటూ ఉద్యోగులను రెచ్చగొడుతోందని, దీనిని అడ్డుకోవడానికే సర్క్యులర్ పంపాల్సి వచ్చిందని వివరించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
జీవితంలో సక్సెస్ సొంతం చేసుకోవాలంటే ఈ4పనులు సిగ్గు లేకుండా చేయాలి
జీవితంలో సక్సెస్ సొంతం చేసుకోవాలంటే ఈ4పనులు సిగ్గు లేకుండా చేయాలి
బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీపై కీలక అప్‌డేట్‌.. అప్పటి నుంచి పూర్తిగా 4G
బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీపై కీలక అప్‌డేట్‌.. అప్పటి నుంచి పూర్తిగా 4G
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
అది నాకు కూడా నచ్చలేదు.. కానీ నో చెప్పలేదు..
అది నాకు కూడా నచ్చలేదు.. కానీ నో చెప్పలేదు..
ధోనీతో అట్లుంటది మరి.. 16 ఏళ్ల రూల్‌ని మార్చేస్తోన్న బీసీసీఐ
ధోనీతో అట్లుంటది మరి.. 16 ఏళ్ల రూల్‌ని మార్చేస్తోన్న బీసీసీఐ
తన కోసం తరలివచ్చిన జనాన్ని చూసి వినేశ్ కంటతడి..
తన కోసం తరలివచ్చిన జనాన్ని చూసి వినేశ్ కంటతడి..
మృణాళ్ ఠాకూర్ అంతా తెలిసే చేస్తున్నారా.! చేసిన 3 సినిమాలకే ఇంతా.?
మృణాళ్ ఠాకూర్ అంతా తెలిసే చేస్తున్నారా.! చేసిన 3 సినిమాలకే ఇంతా.?
ఇంట్లో నుంచి దట్టమైన పొగ.. ఏమైందని ఆరాతీయగా..
ఇంట్లో నుంచి దట్టమైన పొగ.. ఏమైందని ఆరాతీయగా..
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!