ఈ రక్షా బంధన్ ప్రత్యేకత ఇదే.. 

TV9 Telugu

17 August 2024

రక్షా బంధన్ రోజున నుదుటిన తిలకం పెట్టి రాఖీని కడతారు సోదరీమణులు. బదులుగా సోదరుడు తన సోదరికి తన శక్తి మేరకు అండగా ఉంటానని హామీ ఇస్తాడు.

అయితే రక్షా బంధన్ ఎప్పుడు ప్రారంభం అయిందని అడిగితే మాత్రం మన పెద్దలు, పండితులు అనేక కథలు చెబుతుంటారు.

ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు అనేక శుభ యోగాలు కూడా ఏర్పడంతో రాఖీ పండగకు మరింత ప్రత్యేకత సంతరించుకోనుంది.

ఈ ఏడాది రాఖీ రోజునే సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, వైభవ యోగం ఏర్పడుతున్న కారణంగా రాఖీ కడితే సోదరుల పురోగతిలో ఆటంకాలు తొలగిపోతాయి.

సోదర సోదరీమణులు అందరూ ఏ సమయంలో రాఖీ కట్టాలి, రాఖీ కట్టే సరైన సమయంతో పాటు చేయాల్సిన పూజల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

రాఖీ కట్టే ముందు ముందుగా ప్లేట్ ను అలంకరించి అందులో రాఖీ, స్వీట్లను ఉంచి అందులో దీపం కూడా వెలిగించాలి.

ముందుగా సోదరుడికి తిలకం పెట్టి కుడి చేతికి రాఖీ మూడు ముడులతో కట్టాలి.  ఈ ముడులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించినవిగా నమ్ముతారు.

ఆ తర్వాత సోదరుడికి స్వీట్లు తినిపించాలి. ఆ తర్వాత సోదరులకు హారతి ఇచ్చి వారి దీర్ఘాయువు, సంతోషకరమైన జీవితాన్ని కోరుకోండి.