త్వరలో మార్కెట్‌లో ఆపిల్ బుల్లి కంప్యూటర్
TV9 Telugu
17 August 2024
టెక్ దిగ్గజం ఆపిల్.. మ్యాక్ మినీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఓ బుల్లి కంప్యూటర్ ఆవిష్కరించే పనిలో పడింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ తోపాటు ఎం4 చిప్‌తో రానున్నట్లు విశ్వసనీయ వర్గాలనుంచి వినిపిస్తున్న సమాచారం.
2010 నుంచి డిజైన్ మార్పుతో వస్తున్న తొలి కంప్యూటర్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతోపాటు M4 Chip.
ఈ కంప్యూటర్ వచ్చే అక్టోబర్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్లోకి వస్తుందని టెక్ నిపుణుల అంచనా.
ఈ మ్యాక్ మినీ కంప్యూటర్ఆ పిల్ టీవీ స్ట్రీమింగ్ డివైజ్ సైజును పోలి ఉంటుందని సంస్థ అధికారులు చెబుతున్నారు.
ఈ కంప్యూటర్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆపిల్ మ్యాక్ మినీ కంప్యూటర్ కంటే 1.4 అంగుళాల పొడవు ఉంది.
మార్కెట్‌లో ఉన్న మ్యాక్ మినీ 599 డాలర్లు. కానీ.. కొత్త వెర్షన్ మ్యాక్ మినీ ధర ఇంకా తక్కువకే లభించే ఛాన్స్.
ఈ స్మాలెస్ట్ మ్యాక్ మినీతోపాటు ఈ ఏడాది చివర్లో ఎం4 చిప్ పవర్డ్ ఐమ్యాక్స్, మ్యాక్ బుక్ ప్రోస్ ఆవిష్కరిస్తారని సమాచారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి