Amarnath Ice Lingam: అమర్‌నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!

Updated on: Jul 11, 2026 | 4:12 PM

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పవిత్ర బాబా బర్ఫానీ మంచు లింగం పూర్తిగా కరిగిపోయింది. గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ భక్తుల విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే లక్ష మందికి పైగా యాత్రికులు పవిత్ర గుహను దర్శించుకోగా, యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది.

పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులకు తొలి రోజుల్లోనే తీవ్ర నిరాశ ఎదురైంది. హిమాలయాల్లోని పవిత్ర గుహలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడే బాబా బర్ఫానీ కరిగిపోయింది. యాత్ర ప్రారంభమైన కేవలం ఐదు రోజుల్లోనే మంచులింగం పూర్తిగా కరిగిపోవడంతో భక్తుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, హిమగిరుల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే దీనికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు తొలి రోజు నుంచే భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడం, వారి శ్వాసక్రియ వల్ల వెలువడే వేడి కారణంగా కూడా మంచులింగం చాలా త్వరగా కరిగిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ త్రిశూల వేదిక మాత్రమే కనిపిస్తోంది. మంచు లింగం కరిగిపోయినప్పటికీ, ఆ పవిత్ర స్థలం పట్ల భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,13,000 మంది యాత్రికులు పవిత్ర గుహను దర్శించుకున్నారు. ‘హర హర మహాదేవ్’ స్మరణలతో పహల్గామ్, బాల్తాల్ మార్గాలు మారుమోగుతున్నాయి. ఈ ఏడాది జులై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈసారి దర్శనాల కోసం ఇప్పటికే 4 లక్షల మందికి పైగా భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. మంచు లింగం కరిగిపోయిన నేపథ్యంలో, అమర్‌నాథ్ శ్రైన్ బోర్డ్ వాతావరణ పరిస్థితులపై యాత్రికులకు ముందస్తు సమాచారం అందిస్తూ బేస్ క్యాంపుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పు చేసి కడుతున్నాను బ్రో.. నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ.. చూస్తే నవ్వాగదు

ఏంటి? పవన్‌ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?

V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం

Naga Durga: బిగ్ బాస్‌ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్

Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..

Follow Us