ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో చూస్తే కన్నీళ్లే

Updated on: Dec 07, 2025 | 11:31 AM

ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే పూర్తి రీఫండ్ ఇవ్వాలని ఆదేశించింది. తాజా వైఫల్యంతో ఇండిగో తన చరిత్రలో ఎన్నడూ లేనంత చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది. ఒకేసారి వెయ్యికిపైగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో ఓ హృదయవిదారక వీడియో నెటిజన్లకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిన సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో ఆందోళనను రేకెత్తిస్తోంది.

వీడియోలో ఓ తండ్రి తన కూతురికి నెలసరి కారణంగా రక్తస్రావం అవుతుందని, శానిటరీ ప్యాడ్ అందించాల్సిందిగా ఇండిగో సిబ్బందిని కోరారు. కానీ తాము శానిటరీ ప్యాడ్స్ అందించలేమంటూ వాళ్లు తిరస్కరించారు. “నా కూతురికి రక్తస్రావం తీవ్రంగా అవుతుంది.. సిస్టర్‌ దయచేసి శానిటరీ ప్యాడ్ ఇవ్వండి” అంటూ తండ్రి బాధతో సిబ్బందిని వేడుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కానీ దానికి సమాధానంగా “మేం శానిటరీ ప్యాడ్‌లను అందించలేం” అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వైరల్‌ వీడియో చూసిన నెటిజన్లు ఇండిగో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడం అన్యాయమని కామెంట్‌ చేసారు. అసలు మానవత్వం కూడా చూపించకుండా ప్రవర్తించడం అత్యంత దారుణమని కామెంట్స్ చేసారు. వేలకు వేలకు టికెట్ల ధరలు వసూలు చేసే సంస్థలు.. ప్రయాణికులకు కనీసం సాధారణ సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో