ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు! వైరల్ అవుతున్న కియారా, సిద్ధార్థ్ కొత్త ఫోటో!

Updated on: Sep 11, 2026 | 7:33 PM

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం 80s రెట్రో ట్రెండ్‌ వైరల్‌గా మారింది. ఏఐ టెక్నాలజీ సాయంతో బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమను నాటి క్లాసిక్‌ లుక్స్‌లో చూపించుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా జంట రెట్రో ఫొటోతో సందడి చేయగా, అమీషా పటేల్‌ స్టైలిష్‌ లుక్‌లో మెరిశారు. శ్రుతి హాసన్‌ మాత్రం 60s హిప్పీ లుక్‌ను ఎంచుకున్నారు. తాహిరా కశ్యప్‌, సబా అలీ ఖాన్‌ కూడా తమ రెట్రో వెర్షన్లను షేర్‌ చేశారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం 80వ ట్రెండ్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఏఐ టెక్నాలజీ సాయంతో నాటి రెట్రో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వైరల్ ట్రెండ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నాస్టాల్జిక్ థీమ్‌లో మన అభిమాన తారలు సరికొత్త క్లాసిక్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ ఏఐ రెట్రో చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సిద్ధార్థ్ క్లాసిక్ డబుల్-డెనిమ్ డ్రెస్, డార్క్ ఏవియేటర్స్ ధరించగా.. కియారా గులాబీ రంగు పఫ్ స్లీవ్స్ డ్రెస్, పెద్ద హూప్స్, గాజులతో ఆనాటి ఫ్యాషన్‌ను అద్భుతంగా కళ్లకు కట్టారు. ఇక అమీషా పటేల్ నియాన్ పింక్ టాప్, డెనిమ్ షార్ట్స్‌తో బూమ్‌బాక్స్ మీద కూర్చున్న స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. మరికొందరూ ఈ ట్రెండ్‌కు కాస్త భిన్నంగా వెళ్లారు. శృతి హాసన్ 80లని కాకుండా ఏకంగా 1960ల నాటి హిప్పీ లుక్‌ను ఎంచుకుని ప్రింటెడ్ టాప్, హెడ్‌స్కార్ఫ్‌తో అదరగొట్టారు. వీరితో పాటు ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్, సబా అలీ ఖాన్ వంటి ప్రముఖులు సైతం తమ సొంత రెట్రో వెర్షన్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. నాటి అందమైన జ్ఞాపకాలను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ సెలబ్రిటీలు చేస్తున్న ఈ ప్రయోగం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: ఆర్టీసీ నైట్​ సర్వీసులు షురూ – హైదరాబాద్‌లో ఇక 24/7 బస్సులు

Irumudi OTT: గుడ్ న్యూస్ OTTలోకి ఇరుముడి!

Sardar 2: సర్దార్ 2కు బిగ్ షాక్…ఖాళీగా థియేటర్లు!

TOP 9 ET News: కలెక్షన్లా.. చీవాట్లా | మరీ దారుణం600కోట్లు ఖర్చు పెడితే ఎంతొచ్చిందటే?

టీటీడీ సంచలన నిర్ణయం.. భక్తులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం!

Loading...
Unable to load recommendations.
Follow Us