అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.

|

Jul 15, 2024 | 9:31 AM

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు అండమాన్‌ నికోబార్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లానుంచి అండమాన్‌ నికోబార్‌కు వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన విమల అనే మహిళ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం అండమాన్ నికోబార్ లోని G.B.పంత్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఇసకలపాలెంకు చెందిన ఈ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 6న మృతి చెందింది.

ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు అండమాన్‌ నికోబార్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లానుంచి అండమాన్‌ నికోబార్‌కు వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన విమల అనే మహిళ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం అండమాన్ నికోబార్ లోని G.B.పంత్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఇసకలపాలెంకు చెందిన ఈ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 6న మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులు, ఇతర వలస కుటుంబాలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా రెండు రోజుల క్రితమే విమల మృతదేహానికి పోస్టుమార్టం కూడా పూర్తయింది. అయితే విమల మృతికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేవరకూ మృత దేహాన్ని తీసుకెళ్లమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

అండమాన్‌ నికోబార్‌ కు వలస వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు, తెలుగు సంఘాలు, ఆందోళనకు మద్దతు తెలుపుతూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం నుంచి గోల్‌ఘర్‌ జంక్షన్‌ వరకూ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో అండమాన్‌ నికోబరా్‌ పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంపై స్థానిక తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అండమాన్ నికోబార్ లోని పరిస్థితులపై ఆందోళన చెందుతున్న శ్రీకాకుళం జిల్లా వలస కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on