Viral: చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో ట్రేండింగ్

|

Jul 25, 2024 | 6:26 PM

ఏ ఆడపిల్లకైనా తన తల్లిదండ్రుల తర్వాత అంతటి రక్షణ కల్పించేది మేనమామ మాత్రమే. తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆడపిల్లను విడిచి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ బిడ్డను మేనమామదగ్గర వదిలి వెళ్తారు. అంత విలువైనది, సురక్షితమైనది ఆ బంధం. అయితే తన కూతురికి మేనమామ లేని లోటును తీర్చాలనుకున్న ఓ తల్లి తన కుమార్తెకే కాదు, తన తల్లిదండ్రులకు కూడా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చి అందరి మన్ననలు పొందారు ఆ మహిళ.

అనకాపల్లిలో ఓ కుటుంబం చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. ప్రమాదంలో చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి ఆశ్చర్యపోయారు ఆ తల్లిదండ్రులు. అనకాపల్లి గవరపాలెంకు చెందిన పెంటకోట కిరణ్‌ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసేవాడు. 2020లో అతనికి వివాహమైంది. అదే ఏడాది ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో కిరణ్‌ ప్రాణాలు కోల్పోయాడు. కిరణ్‌కు తన మేనకోడలు లాస్య అంటే పంచప్రాణాలు. తన మేనకోడలి మొదటి ఫంక్షన్‌ తన చేతులమీదుగా వైభవంగా జరిపించాలని ఆశపడేవాడు. అయితే ఆ రోజు రానే వచ్చింది. కానీ కిరణ్‌ మాత్రం లేడు. కిరణ్‌ అక్క తన తమ్ముడు కోరిక నెరవేర్చాలనుకున్నారు. తన కూతురికి మేనమామ చేతుల మీదుగా లాంఛనాలు జరిపించాలనుకున్నారు. వెంటనే తన తమ్ముడి మైనపు బొమ్మను తయారు చేయించారు. మూడున్నర లక్షలు ఖర్చుచేసి ముంబైలో మైనపు బొమ్మ చేయించి కూతురి ఫంక్షన్‌లో ఆమె చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు.

తన మావయ్యే ఫంక్షన్‌ జరిపిస్తున్నారా అన్నంతగా మురిసిపోయింది లాస్య. జీవకళ ఉట్టిపడుతున్న ఆ మైనపు బొమ్మలో కిరణ్‌ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూసుకొని పొంగిపోయారు. తమ కుమారుడే స్వయంగా వచ్చి కూర్చున్నాడా అన్నట్టుగా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. లాస్య తల్లి మాధవి ప్రయత్నం అక్కడున్నవారందరినీ ఆకట్టుకుంది. మాధవికి తన తమ్ముడిపై ఉన్న ప్రేమకు అందరూ మెచ్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on