Bedroom:బెడ్‌రూమ్‌ భారత్‌లో-కిచెన్‌ మయన్మార్లో.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లాలంటే దేశం దాటాల్సిందే..! వీడియో ట్రేండింగ్..

|

Jan 22, 2023 | 9:59 AM

అక్కడ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాలంటే దేశ సరిహద్దులు దాటాల్సిందే.. ఇదేంటి బెడ్‌రూమేంటి.. సరిహద్దులేంటి.. అనుకుంటున్నారా... ఏం లేదండి నాగాలాండ్‌లోని ఓ వ్యక్తికి చెందిన ఇల్లు దేశ సరిహద్దుల్లో ఉంది.


అక్కడ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాలంటే దేశ సరిహద్దులు దాటాల్సిందే.. ఇదేంటి బెడ్‌రూమేంటి.. సరిహద్దులేంటి.. అనుకుంటున్నారా… ఏం లేదండి నాగాలాండ్‌లోని ఓ వ్యక్తికి చెందిన ఇల్లు దేశ సరిహద్దుల్లో ఉంది. అయితే ఆ ఇల్లు నిర్మాణం కూడా విచిత్రంగా ఉంది మరి. అందుకే ఆ ఇంట్లో కిచెన్‌లోంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లాలంటే దేశ సరిహద్దులు దాటేసినట్టే… నాగాలాండ్‌లోని మోన్‌జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్‌ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాదు భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో ఈ గ్రామం ఉంటుంది. లాంగ్వాలో ‘కొన్యాక్‌ నాగా’ తెగకు చెందిన వారే అధికంగా ఉంటారు. ఈ తెగకు ఆంగ్‌ అనే వ్యక్తి అధిపతిగా వ్యవహరిస్తుంటాడు. ఆంగ్‌ నివసించే ఇల్లు ఇండియా-మయన్మార్‌ సరిహద్దులో సగభాగం ఇండియాలో, సగభాగం మయన్మార్‌లో ఉంది. ఈ ఇంట్లోని కిచెన్‌ మయన్మార్‌లో ఉంటే… బెడ్‌రూమ్‌ మాత్రం భారత్‌లో ఉండటం విశేషం. అందుకే ఆంగ్‌ తను బెడ్‌రూమ్‌కి వెళ్లాలంటే మయన్మార్‌ సరిహద్దులు దాటి ఇండియాలోకి వస్తున్నారు. ఈ ఇంటికి సంబంధించిన వీడియోను నాగాలాండ్‌ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘ఆ కుటుంబ సభ్యులు భారత్‌లో పడుకుంటారు.. మయన్మార్‌లో తింటారు..’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on