Viral Video: గుడ్డుతో కోడి సయ్యాటలు..సినిమా రేంజి స్టంట్లు..వైరల్ గా మారిన వీడియో..విషయం తెలిస్తే నవ్వుకుంటారు!

|

Jun 24, 2021 | 9:35 PM

Viral Video: సినిమాల్లో స్టంట్ సన్నివేశాలు చూస్తున్నపుడు ఎలా ఉంటుంది? అసలు చూస్తున్నంత సేపు నిజంగా ఎదో జరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ నటుడు చేసే విన్యాసాలు చూసి అబ్బా.. అనుకుంటాం.

Viral Video: గుడ్డుతో కోడి సయ్యాటలు..సినిమా రేంజి స్టంట్లు..వైరల్ గా మారిన వీడియో..విషయం తెలిస్తే నవ్వుకుంటారు!
Viral Video Chicken Stunts With Egg
Follow us on

Viral Video: సినిమాల్లో స్టంట్ సన్నివేశాలు చూస్తున్నపుడు ఎలా ఉంటుంది? అసలు చూస్తున్నంత సేపు నిజంగా ఎదో జరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ నటుడు చేసే విన్యాసాలు చూసి అబ్బా.. అనుకుంటాం. మళ్ళీ మళ్ళీ చూసేస్తాం. ఏం మనుషులేనా? మేమూ చేయగలం స్టంట్ లు అని ఒక కోడి స్టంట్ లు మొదలెట్టింది అనుకోండి ఏమనిపిస్తుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించదూ.. అదిగో అలాగే ఓ కోడి.. తన గుడ్డుతో వీర లెవెల్లో స్టంట్స్ చేసింది. గుడ్డును కాలితో గాల్లోకి లేపేసింది. రెండో కాలితో ఆపేసింది. మళ్ళీ దానిని ఎగరేసింది. ఈ సారి తన మెడ భాగంతో గుడ్డును పట్టుకుని అక్కడ కొద్ది సేపు నిలబెట్టింది. తరువాత దానిని రెక్కల మీదకు చేర్చుకుంది. రెక్కలతో గుడ్డును కొద్ది సేపు గాలిలో ఆడించింది. తరువాత మళ్ళీ కాళ్ళతో గుడ్డును ఎగరేసి పట్టుకుంది. ఇలా కొద్ది నిమిషాలు కోడి అద్భుతమైన విన్యాసాలు చేసింది. నమ్మరా? అందుకే మరి వీడియో చూపిస్తున్నాం.. ఇది వైరల్ అయిపొయింది. చాలా మంది దీనిని చూసి మరికొంతమందికి చూపించి ఇంటర్నెట్ లో తెగ తిప్పేశారు. అయితే, అందరూ కూడా మనసులో ఎదో అనుమానం ఉన్నా నిజమేనేమోలె అని సరిపెట్టుకున్నారు. కొందరేమో సినిమా స్టంట్లు చూడట్లే ఇదీ అంతే అని అనుకుని వదిలేశారు. ఈ వీడియో ఇక్కడ ఈ ట్వీట్ లో మీరు చూడండి.

ఇదిగో ఇలా మీకులా వీడియో చూసిన తరువాత అనుమానం వచ్చినవాళ్లు ఆ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే పని పెట్టుకున్నారు. దీంతో అర్ధం అయింది.. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేసిన అద్భుతమైన ఎడిటింగ్ అని. సినిమాల లెవెల్లో ఈ ఎడిటింగ్ చేశారు. సోషల్ మీడియాలో కాబట్టి అంతా శల్యపరీక్ష చేసి చూశారు గానీ మామూలుగా ఏ టీవీలోనో దీనిని చూపిస్తే ఎక్కడా అనుమానం లేకుండా నిజం అని వదిలేద్దురు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ వీడియో మొదట సోషల్ మీడియాలో వైరల్ అయిపొయింది. తరువాత ఇది ఎఫెక్ట్స్ వీడియో అని తెలిశాకా మళ్ళీ వైరల్ అయిపొయింది. అన్నట్టు ఇది జస్ట్ సరదా కోసమే మీకు అందిస్తున్నాం. ఇది నిజమని మేము చెబుతున్నామని అనుకోవద్దు సుమా.. ఇదంతా ఒట్టి గ్రాఫిక్స్.. మీరు కనుక కోడిని పెంచుతున్నట్టయితే దాని కంట ఈ వీడియో పదనీయవద్దు. ఎందుకంటే, మీకు ఒక్క గుడ్డు కూడా తరువాత దొరకకపోవచ్చు..

Also Read: Rahul Gandhi: రాహుల్‌ గాంధీ వెనకున్న ఫొటో ఎవరు తీసారో తెలుసా..?? ( వీడియో )

Viral Video: గుజరాత్‌లో ఏలియన్స్‌.! మిస్టరీగా మారిన ఆకాశంలో వింత కాంతి… ( వీడియో )