గుండెకు మూడు సర్జరీలు.. అయినా గిన్నిస్‌ రికార్డు సొంతం

|

Aug 12, 2023 | 9:43 AM

బ్రిటన్‌కు చెందిన 77 ఏళ్ల కోలిన్‌ హాంకాక్‌ గుండెకు మూడు సార్లు బైపాస్‌ సర్జరీలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డు లో స్థానం సంపాధించారు . పాత రికార్డును ఆయన బద్దలు కొట్టారు. వంశపారపర్యంగా సంక్రమించే హైపర్‌ కొలెస్టెరోలేమియా అనే సమస్యతో కోలిన్‌ బాధపడుతున్నారు. ఇది శరీరంలో కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్‌ డిసీజ్‌కు కారణమవుతుంది. దీని వల్ల 30 ఏళ్ల వయసులో గుండె పోటు వచ్చింది. ఆ తర్వాత ఏడాదిలో మూడు సార్లు బైపాస్‌ శస్ర్త చికిత్సలు చేశారు.

బ్రిటన్‌కు చెందిన 77 ఏళ్ల కోలిన్‌ హాంకాక్‌ గుండెకు మూడు సార్లు బైపాస్‌ సర్జరీలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డు లో స్థానం సంపాధించారు . పాత రికార్డును ఆయన బద్దలు కొట్టారు. వంశపారపర్యంగా సంక్రమించే హైపర్‌ కొలెస్టెరోలేమియా అనే సమస్యతో కోలిన్‌ బాధపడుతున్నారు. ఇది శరీరంలో కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్‌ డిసీజ్‌కు కారణమవుతుంది. దీని వల్ల 30 ఏళ్ల వయసులో గుండె పోటు వచ్చింది. ఆ తర్వాత ఏడాదిలో మూడు సార్లు బైపాస్‌ శస్ర్త చికిత్సలు చేశారు. అతను ఈ సర్జరీలు చేయించుకుని 45 సంవత్సరాల 361 రోజులు గడించింది. ఈ కాలంలో ఆయనకు మరో శస్ర్త చికిత్స జరగలేదు. ఇప్పటికీ కోలిన్‌ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం పొందారు. గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన డెల్బర్ట్ డేల్ మెక్‌బీ పేరిట ఉంది. ఆయన ట్రిపుల్‌ బైపాస్‌ సర్జరీ చేయించుకుని 41 ఏళ్ల 63 రోజులు జీవించారు. 2015లో తన 90 ఏటా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కోలిన్‌ ఈ రికార్డును బద్దలు కొట్టారు. 30 ఏళ్ల వయసులో తాను పలు క్రీడల్లో పాల్గొనేవాడినని.. ఆ సమయంలో తనకి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని కోలిన్‌ అన్నారు. అయితే, తన చిన్నతనంలో ఆరోగ్యం కోసం మంచి ఆహారం కూడా తీసుకోలేదని, గుడ్లు, చిప్స్‌ ఇష్టంగా తినేవాడినని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naa Anveshana: వైజాగ్ యూట్యూబర్ అన్వేష్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తెలివైన దొంగ.. కుక్కకు ముద్దుపెట్టి..సైకిల్‌ లేపేసాడు

పిల్లి.. పులిగా మారడాన్ని మీరు చూశారా.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్‌ వీడియో

తలకు హెల్మెట్ వేసుకుంటేనే ఆఫీస్‌కి ఎంట్రీ !!

RGV: దిమ్మతిరిగేలా.. టైం చూసి ఇచ్చాడయ్యా… ఆర్జీవీ..