ముందుంది మెగా నినో

Updated on: Nov 25, 2026 | 12:00 PM

పసిఫిక్ మహాసముద్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల పెరుగుదల మెగా ఎల్ నినో ముప్పును సూచిస్తోంది. పెరూ తీరం, గాలపాగోస్ దీవుల వద్ద 10°C అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, డిసెంబర్ నుంచి మార్చి 2027 వరకు దీని తీవ్ర ప్రభావం ప్రపంచంపై ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కరువులు, వరదలకు దారితీసి, 2027ని చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మార్చే అవకాశం ఉంది.

ప్రకృతి ప్రకోపానికి ప్రపంచం మరోసారి వణికిపోనుందా? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అవుననే అంటోంది. పసిఫిక్ మహాసముద్రంలో అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో, మెగా ఎల్ నినో ప్రమాదం ముంచుకొస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గతంలో మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగితేనే నరకం చూసిన మానవాళి, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలను ఎదుర్కొంటోంది. దక్షిణ అమెరికాలోని పెరూ తీరం, గాలపాగోస్ దీవుల సమీపంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 10 డిగ్రీలు అధికంగా నమోదవడం శాస్త్రవేత్తలను నివ్వెరపరుస్తోంది. ఇది సాధారణ ఎల్ నినో కాదని, అంతకు మించిన మెగా ఎల్ నినో అని అమెరికా వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డిసెంబర్ నెల నుంచి దీని విధ్వంసకర ప్రభావం మొదలై, మార్చి 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా. ఈ మెగా ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వడగాలులు, కరువులు, కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలకు దారితీస్తుందని, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?

Published on: Nov 25, 2026 11:58 AM
Loading...
Unable to load recommendations.
Follow Us