AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అంతా దేవత మహిమ.! కొట్టేసిన హుండీ సొమ్ము వాపస్ తెచ్చిన దొంగలు.. వీడియో

Video: అంతా దేవత మహిమ.! కొట్టేసిన హుండీ సొమ్ము వాపస్ తెచ్చిన దొంగలు.. వీడియో

Ravi Kiran
|

Updated on: Sep 08, 2025 | 9:14 PM

Share

ఒక్కసారి దొంగలుపడి దోస్కపోయిర్రంటె.. మల్ల ఆ సొమ్ము వాపస్ వచ్చుడు అసాధ్యం. అది దేవుని గుల్లె దోస్కపోయిన సొమ్మయినా సరే.. తూర్పు తిరిగి దేవునికి దండం పెట్టి, నీళ్లు వదులుకోవల్శిందే. కని గా అనంతపురం జిల్లాల ఎవ్వలు ఊహించని శిత్రమే జరిగిందుల్లా.. నెల రోజులకింద హుండీని దోస్కపోయిన దొంగోల్లు.. కొట్టేశిన ఆ సొమ్ము తీస్కచ్చి గుల్లె వెట్టి పోయిర్రట..

హమ్మో.. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంల ఉన్న ఈ ముసలమ్మతల్లి శాన పవర్ఫుల్ దేవతనే ఉన్నట్టుందిగా? నెలకింద హుండీని దోస్కపోయ్న నలుగురు దొంగలకు బుద్దొచ్చేతట్టు చేశిందట.. ఇగ సూడు.. చీకట్లచ్చి ఎట్ల ఎత్కపోయిర్రో.. మల్ల అట్లనే కొట్టేశిన సొమ్మంత మూటకట్టి, గుడి కాంపౌండ్ లోపట వెట్టి శీకట్ల కల్శిపోయిర్రట.. ఇగొ ఇదే ఆ మూట.. తెల్లారినంక గుడి తెర్వంగనె ఎదురుంగ మూల కనవడ్డదట. ఎంటనే గుడి ధర్మకర్తకు, పోలీసోల్లకు ముచ్చట చెప్తె.. అందరుగల్శి మూట ఇప్పి పైసలన్ని కిందవోశి లెక్కేశిర్రు.. మొత్తం లక్షా ఎన్బయ్ ఆరు వేల రూపాలున్నయట.. అయితె మూటతోపాటు దొంగలు రాశిన ఈ శిట్టీ గూడ ఉందట.. ఇగ సూడు ఏం రాశిర్రో.. అన్ని తప్పులు తప్పులు రాశిర్రు మేం జర సరిచేశి సద్వుతం ఇనుర్రిగ.. తప్పై పై అమ్మా.. అంటె తప్పైందమ్మా అన్నట్టు.. మేము నలుగురు దొంగతనం సెషన్.. అంటె చేశినం అన్నట్టు.. దొంగతనం వననాకొడుకు సీరియస్ హిందీకుంది.. అంటె దొంగతనం చేశినందుకు నా కొడు్కు సీరియస్ అయ్యింది.. నాన్ని శమించండ ఆమ్మ.. ఈ డబ్బులు కొద్దిగా వాడుకున్నాను.. నా కొడుకు హసిటల్ కుర్ చాలుకి నన్ను శమించండం ఆమ్.. పాపం… శిన్నప్పుడు సక్కగ సద్వుకోనట్టుర్రు దొంగలెవలోగని.. అమ్మ నీ సొమ్ము కొట్టేశినందుకు మా పిల్లల పానం బాగలేదు.. అంత సీరియస్సుంది.. అందుకే కొట్టేశిన సొమ్ములకేలి కొంత తీస్కోని వాడుకున్నం దావ్కన కర్సులకు మమ్ములను క్షమించుమని లెటర్ రాశిపెట్టి సోయిర్రట..