మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువై పోతున్నాయి. సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, తినడానికి సరైన సమయం ఉండకపోవడం కారణంగా చాలా సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది. అందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి.
ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువై పోతున్నాయి. సరైన లైఫ్ స్టైల్ విధానం లేకపోవడం, ఆహారపు అలవాట్లు మారడం, తినడానికి సరైన సమయం ఉండకపోవడం కారణంగా చాలా సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది. అందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్.. మరొకటి మంచి కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ శరీరాన్ని దెబ్బ తీస్తే.. గుడ్ కొలెస్ట్రాల్ శరీరాన్ని కాపాడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిలో విచ్చలవిడిగా కొవ్వు అనేది పెరిగి పోతుంది. దీని వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ అధికంగా ఉండే మహిళలు ఆరోగ్య పరంగా సరైన కేర్ తీసుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతే.. అనేక లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలోనూ ఒకేలా ఉండవు. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. త్వరగా ఈ సమస్య నుంచి బయట పడటం మంచిది. లేదంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గుండెకి, శరీరంలోని ఇతర భాగాలకు రక్త సరఫరా ఆగిపోతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతే.. రక్త ప్రసరణ వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. గుండె నొప్పి సమస్యలు, శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు కనిపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే స్త్రీల్లో ఎక్కువగా కాళ్ల నొప్పులు పెరుగుతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడి
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
Taapsee Pannu: అనంత్ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ సీన్ చూసి షాక్ !!