పెన్షనర్లకు బిగ్ షాక్! డిసెంబర్ 31 లోపు ఇది చేయాల్సిందే.. లేకపోతే
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. పెన్షన్ల ఆలస్యాన్ని నివారించడానికి, డిసెంబర్ 31లోపు పాన్-ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. సరైన డేటా వెరిఫికేషన్ ద్వారా అర్హులందరికీ సకాలంలో పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ లక్ష్యం. లేకపోతే, భవిష్యత్తులో పెన్షన్ల విడుదలలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావచ్చు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు అత్యంత కీలకమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీని కఠినమైన డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. ఈ గడువులోగా సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు కుటుంబ పెన్షనర్లు తమ పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను సంబంధిత శాఖల రికార్డులతో సరిపోల్చుకోవాలని ఆదేశించింది. గత కొద్ది వారాలుగా పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర అలజడి చెలరేగింది. దీనిపై రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు నిరసనలు తెలిపాయి. ప్రభుత్వ రికార్డుల్లో డేటా మిస్‌మ్యాచ్‌లు, అసంపూర్ణ వివరాల కారణంగానే చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ప్రభుత్వం ఈ పాన్-ఆధార్ వెరిఫికేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. డిసెంబర్ 31లోగా తమ వివరాలను సరిచేసుకోని వారికి భవిష్యత్తులో పెన్షన్లు లేదా జీతాల విడుదలలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనర్హులను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎటువంటి అవాంతరాలు లేకుండా సకాలంలో పెన్షన్లు అందేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ గడువును గుర్తుంచుకొని తక్షణమే తమ వివరాలను సరిచేసుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. విలాసవంతమైన కార్లలో షో.. చివరికి
మరో 10 ఏళ్లలో మానవాళిని.. AI అంతం చేస్తుందా?
భక్తులారా జర జాగ్రత్త! వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసి.. తిరుమల వెళ్తే ఊహించని షాక్!
సూర్యకుమార్ యాదవ్ లగ్జరీ హోమ్.. షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి!
