తెలంగాణకు భారీ వర్ష సూచన.. దంచికొట్టనున్న వానలు వీడియో
తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అంచనా.
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయబడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం :
