కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్.. ముందుకా..వెనక్కా?వీడియో

Updated on: Sep 27, 2025 | 11:59 AM

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర గందరగోళంలో ఉంది. హైకోర్టు ఆదేశాలు, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత, ఎన్నికల కమిషన్ సన్నద్ధత పార్టీని ఇరకాటంలో పడేశాయి. రిజర్వేషన్లు లేకుండా ముందుకు వెళ్ళలేక, ఎన్నికలు ఆలస్యం చేస్తే కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితితో కాంగ్రెస్ ముందు నూయి, వెనక గొయ్యి వంటి ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర గందరగోళంలో ఉంది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం, ఆర్డినెన్స్ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో జీవో ద్వారా అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో