Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా

Updated on: Mar 06, 2026 | 7:42 PM

తెలంగాణలో మార్చి 14 నుండి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుండి లేదా 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా తమ హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాఠశాలల్లో కూడా అందుబాటులో ఉంటాయి. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి, ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. మార్చి 14 నుండి ప్రారంభం కానున్న పరీక్షల కోసం విద్యాశాఖ హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. మార్చి 14న ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఏప్రిల్‌ 16 వరకూ జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం తొమ్మిదిన్నర గంటలనుంచి పన్నెండున్నర గంటల వరకూ జరుగుతాయి. కాగా, ఈ ఏడాది 5.28 లక్షల మంది విద్యార్థులు, 2,676 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. విద్యార్ధులు తమ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి, హోమ్‌ పేజీలో ‘SSC Hall Tickets March-2026’ లింక్‌పై క్లిక్ చేయండి. మీ జిల్లా, పాఠశాల పేరును ఎంచుకుని, మీ పేరు మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత ‘Download Hall Ticket’ బటన్ నొక్కగానే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోండి. ఈసారి విద్యార్థుల కోసం సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి. వాట్సాప్‌లో ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి. ఆ తర్వాత “SSC Hall Ticket March-2026” అని టైప్ చేస్తే మీ మొబైల్‌కే హాల్ టికెట్ అందుతుంది. వైనా సందేహాలు ఉంటే 040-23230942 నంబర్‌కు 24/7 సంప్రదించవచ్చు. ఇప్పటికే హాల్ టికెట్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పాఠశాలలకు పంపారు, విద్యార్థులు నేరుగా తమ స్కూల్‌లో కూడా తీసుకోవచ్చు.విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవడం మంచిది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ పి.వి. శ్రీహరి తెలిపారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం

ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..

ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం

టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI

Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు

Follow Us