ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం?

Updated on: Jun 20, 2026 | 1:22 PM

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఖర్చులను తగ్గించేందుకు దక్షిణ కొరియాలో ‘డోపమైన్‌ స్టోర్స్‌’ అనే కొత్త ట్రెండ్‌ వైరల్‌గా మారింది. నిజమైన ఈ-కామర్స్‌ సైట్ల మాదిరిగా కనిపించే ఈ ప్లాట్‌ఫారమ్‌లలో షాపింగ్‌ చేసిన అనుభూతి లభించినా, డబ్బు ఖర్చు కాదు. అయితే ఈ అలవాటు షాపింగ్‌ వ్యసనాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కొత్త వస్తువులను చూడటం, వాటిని వెంటనే కార్ట్‌లో యాడ్‌ చేయడం, పార్శిల్‌ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూడటం.. ఇదంతా ఒక తీపి అనుభూతి. అయితే, ఈ అలవాటు జేబుకు బాగానే చిల్లు పెడుతుంది. ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా షాపింగ్‌ చేసేస్తుంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియా యువత ఇప్పుడు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అదే డోపమైన్‌ సైట్లలో షాపింగ్‌ చేయడం. నిజానికి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేటప్పుడు.. వాటిని కొనడం వల్ల వచ్చే ఆనందం కంటే.. దానిని వెతికి, కార్ట్‌లో వేసి, ఆర్డర్‌ బటన్‌ నొక్కే ప్రక్రియలోనే మన మెదడులో ‘డోపమైన్‌’ అంటే ఆనందాన్నిచ్చే హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుందని సైకాలజిస్టులు చెబుతారు. కొరియాలో వచ్చిన ఈ ఫేక్‌ డోపమైన్‌ అంటూ డూప్‌ మైన్‌ యాప్స్‌ సరిగ్గా ఇదే సూత్రాన్ని వాడుతున్నాయి. ఈ యాప్స్‌ చూడటానికి వంద శాతం అసలైన షాపింగ్‌ సైట్ల లాగే ఉంటాయి. ఇందులో వందలాది ప్రొడక్ట్స్, వాటి రేటింగ్‌లు, కస్టమర్‌ రివ్యూలు, డిస్కౌంట్‌ ఆఫర్లు అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన దుస్తులు లేదా గాడ్జెట్స్‌ను సెలెక్ట్‌ చేసుకుని ‘కార్ట్‌’లో వేసుకోవచ్చు. ఆ తర్వాత మీ అడ్రస్‌ ఎంటర్‌ చేసి ‘ఆర్డర్‌’బటన్‌ కూడా నొక్కవచ్చు. ట్విస్ట్‌ ఏంటంటే మీరు ఆర్డర్‌ నొక్కగానే స్క్రీన్‌ మీద ఒక డెలివరీ బాయ్‌ మీ ఆర్డర్‌ని తీసుకుని, బైక్‌ మీద మీ ఇంటి వైపు వస్తున్నట్లు మ్యాప్‌లో లైవ్‌గా చూపిస్తుంది. వస్తువు మీ ఇంటికి చేరేవరకు ఉండే ఆ ఉత్కంఠ, ఎగ్జైట్‌మెంట్‌ అన్నీ నిజంగానే అనిపిస్తాయి. కానీ చివరకు మీ ఇంటికి ఎలాంటి వస్తువూ రాదు, మీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఒక్క రూపాయి కూడా కట్‌ అవ్వదు! దీంతో షాపింగ్‌ ఖర్చు నుంచి తప్పించుకోవడంతో షాపింగ్‌ చేశామన్న అనుభూతినీ పొందవచ్చు. ఈ పద్ధతిలో డబ్బును ఆదా చేస్తున్నప్పటికీ, ఇది ఒక రకమైన మానసిక వ్యసనానికి దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. ఏ వస్తువు కొనకపోయినా, ఆ సైట్లలో గడపడం వల్ల షాపింగ్‌ చేయాలనే అదే ప్రవర్తన మెదడులో బలోపేతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ట్రెండ్‌ దక్షిణ కొరియాకే పరిమితమైంది. ఏదేమైనా, షాపింగ్‌ పిచ్చిని వదిలించుకోవడానికి కొరియన్లు కనిపెట్టిన ఈ మార్గం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పైసా ఖర్చు లేకుండా షాపింగ్‌ మజాను అందించే ఈ ‘ఫేక్‌ స్టోర్స్‌’ ఐడియా మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..

రేయ్‌ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!

అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

Maa Inti Bangaram: రఫ్ఫాడించిన సమంత! హిట్టా..? ఫట్టా..?

Peddi: OTTలోకి ‘పెద్ది’ వచ్చేది.. ఎప్పుడంటే..?

Follow Us