Elon Musk: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం!

Updated on: Oct 19, 2026 | 5:22 PM

ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించారు. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ప్రదర్శనలో టెస్లా స్పోర్ట్స్ కారు ర్యాంప్‌పై నుంచి గాల్లోకి ఎగిరి, తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ వీడియోను మస్క్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అయితే, ఇది నియంత్రిత వాతావరణంలో చేసిన విన్యాసం మాత్రమే. సాధారణ రోడ్లపై కార్లు ఎగిరే సాంకేతికత అందుబాటులోకి వస్తుందా అన్నది ఇంకా స్పష్టత లేదు.

ఎలాన్ మస్క్.. ఈ పేరు వినగానే టెక్నాలజీ ప్రపంచంలో ఎన్నో సంచలనాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆయన మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకప్పుడు ఎగిరే కార్ల గురించి మాట్లాడితే నవ్వినవాళ్లే.. ఇప్పుడు టెస్లా కారు గాల్లోకి ఎగిరిన వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. 2018లో ప్రముఖ పోడ్‌కాస్టర్ జో రోగన్‌తో మాట్లాడిన సమయంలో.. టెస్లా రోడ్‌స్టర్ కారుకు రాకెట్ థ్రస్టర్లు అమర్చాలనే ఆలోచనను మస్క్ వెల్లడించారు. అప్పట్లో ఇది నిజంగా సాధ్యమేనా అంటూ జో రోగన్ సందేహం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు మస్క్ తన ఆలోచనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రదర్శనను చూపించారు. అక్టోబర్ 15న అమెరికాలోని టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్ కేంద్రంలో ఈ డెమో నిర్వహించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇందులో టెస్లా స్పోర్ట్స్ కారు ఓ వంపు తిరిగిన ఎత్తైన ర్యాంప్‌పైకి దూసుకెళ్లి.. తలకిందులుగా ప్రయాణిస్తూ కొద్దిసేపు గాల్లోకి ఎగిరి.. తిరిగి సురక్షితంగా చక్రాలపై ల్యాండ్ అయింది. ఈ వీడియోను మస్క్ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేస్తూ.. భవిష్యత్తులో ఎగిరే కార్లు కూడా ఉంటాయని వ్యాఖ్యానించారు. నిజానికి, ఈ ఆలోచన గురించి మస్క్ 2020లో ప్రముఖ కార్ల ప్రియుడు జే లెనోతో కూడా మాట్లాడారు. కారులో కంప్రెస్‌డ్ ఎయిర్‌తో పనిచేసే థ్రస్టర్లను అమర్చవచ్చని వివరించారు. అయితే, తాజా ప్రదర్శనతో సాధారణ రోడ్లపై కారు ఎగరగలదని లేదా గాల్లో తేలగలదని నిర్ధారణ కాలేదు. ఇది నియంత్రిత వాతావరణంలో చేసిన విన్యాసం మాత్రమే. మరోవైపు, కొత్త టెస్లా రోడ్‌స్టర్‌ను 2028లో ఉత్పత్తిలోకి తీసుకురావాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారులో రాకెట్ థ్రస్టర్ టెక్నాలజీ ఉంటుందా? సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందా? అన్నది ఇంకా స్పష్టత లేదు. ఒకప్పుడు అసాధ్యమని అనిపించిన ఆలోచన ఇప్పుడు ఆసక్తికరమైన ప్రదర్శనగా మారింది. మరి నిజంగానే ఎగిరే కార్లు మన రోజువారీ ప్రయాణాల్లో భాగమవుతాయా? అనేది వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌కు ట్రంప్‌ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్‌!

చేతి వాచ్‏లోనూ రామమందిరం, శ్రీరాముడి చిత్రాలు.. ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్

సిరులు కురిపిస్తున్న వక్క తోటలు.. చిగురిస్తున్న రైతుల ఆశలు!

LIC: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే కొత్త పాలసీలు..

WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌!

Loading...
Unable to load recommendations.
Follow Us