భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు

Updated on: Jul 20, 2024 | 9:02 PM

వాతావరణ మార్పులు భూమిని ప్రభావితం చేస్తున్నాయి. ఏకంగా భూ భ్రమణమే మారుతోందని నూతన అధ్యయనం వెల్లడించింది. వాతావరణ మార్పు భూమి అక్షం మార్పునకు కూడా దారితీస్తోందని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ యూనివర్సిటీ నూతన పరిశోధన పేర్కొంది. ధ్రువపు మంచు కరుగుతోందని, ఈ నీరు భూమధ్యరేఖ వైపు ప్రవహిస్తోందని, పర్యవసానంగా భూగ్రహం ద్రవ్యరాశి పంపిణీ జరుగుతోందని, గ్రహం భ్రమణ వేగాన్ని తగ్గిస్తోందని అధ్యయనం పేర్కొంది.

వాతావరణ మార్పులు భూమిని ప్రభావితం చేస్తున్నాయి. ఏకంగా భూ భ్రమణమే మారుతోందని నూతన అధ్యయనం వెల్లడించింది. వాతావరణ మార్పు భూమి అక్షం మార్పునకు కూడా దారితీస్తోందని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్ యూనివర్సిటీ నూతన పరిశోధన పేర్కొంది. ధ్రువపు మంచు కరుగుతోందని, ఈ నీరు భూమధ్యరేఖ వైపు ప్రవహిస్తోందని, పర్యవసానంగా భూగ్రహం ద్రవ్యరాశి పంపిణీ జరుగుతోందని, గ్రహం భ్రమణ వేగాన్ని తగ్గిస్తోందని అధ్యయనం పేర్కొంది. పగటి సమయం కాస్త ఎక్కువగా ఉండేందుకు ఈ పరిణామం దారితీస్తుందని వివరించింది. ఈ మేరకు ‘నేచర్ జియోసైన్స్’లో అధ్యయనాన్ని ప్రచురించింది. కాగా ఈ నూతన అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ బెనెడిక్ట్ సోజా స్పందిస్తూ.. వ్యక్తులు తమ చేతిని చాచి తిప్పుతున్న సదృశ్యానికి ఉదాహరణగా వివరించారు. భూమి ద్రవ్యరాశి అక్షం నుంచి దూరంగా కదిలినప్పుడు భ్రమణ వేగం పెరుగుతుందని, ద్రవ్యరాశి రివర్స్‌లో పంపిణీ అయినప్పుడు భ్రమణం నెమ్మదిస్తుందని వివరించారు. సాధారణంగా చంద్రుడి భ్రమణం కారణంగా భూమిపై పగలు, రాత్రి ఏర్పడుతుంటాయి. అయితే మనుషులు కర్భన ఉద్గారాలను ఇదే స్థాయిలో నిరంతరాయంగా కొనసాగిస్తే వాతావరణ మార్పులు చంద్రుడి ప్రభావాన్ని కూడా అధిగమించి ఎఫెక్ట్ చూపిస్తాయని పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని బెనెడిక్ట్ సోజా హెచ్చరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్‌ మస్క్‌ కూడా వేస్టే

ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్‌ ఔట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ.. జీతం ఎంతో తెలిస్తే !!

యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి

రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. రెచ్చిపోతారంతే..!

Loading...
Unable to load recommendations.
Follow Us