వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. నెలరోజులు చాట్‌జీపీ ప్లస్‌ ఫ్రీ!

Updated on: Oct 08, 2026 | 4:45 PM

భారతీయ వినియోగదారులకు ChatGPT Plusపై ఉచిత ట్రయల్‌ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది అందరికీ కాకుండా ఎంపిక చేసిన ఖాతాలకు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ChatGPTలో Upgrade లేదా Subscription పేజీకి వెళ్లి ఆఫర్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోవచ్చు. ఉచిత ట్రయల్‌ తీసుకునే ముందు ధర, ట్రయల్‌ వ్యవధి, ఆటో-రిన్యువల్‌ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ప్రమోషన్‌ ముగిసిన తర్వాత సాధారణ Plus ధర వర్తించే అవకాశం ఉంది.

ఉచిత ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే.. మీ చాట్‌ జీపీటీ ఖాతాలోకి లాగిన్ అయి, ‘సబ్‌స్క్రిప్షన్’ లేదా ‘అప్‌గ్రేడ్’ పేజీకి వెళ్లండి. ఆఫర్ ఉందో లేదో చూడండి: చాట్‌ జీపీటీ ప్లస్ కార్డు కింద సాధారణ ధర రూ. 1,999 క్యాన్సిల్ అయి, రూ. 0 ఉంటూ “Claim Free Offer” అనే బటన్ ఉందో లేదో తనిఖీ చేయండి. “Claim Free Offer” పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్స్‌ గమనించాల్సిన విషయం ఏంటంటే..ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు, కేవలం ఎంపిక చేసిన ఖాతాలకే పరిమితం. ఇంతకుముందు ఎలాంటి పెయిడ్ ప్లాన్ తీసుకోని ఖాతాలకే ఇది కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్ పొందిన తర్వాత, రెండవ నెల నుంచి మీ ఖాతా నుంచి నెలకు రూ. 1,999 ఆటోమేటిక్‌‌గా కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉచిత కాలం ముగిసేలోపే అవసరం లేదనుకుంటే సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవడం మంచిది. చాట్‌జీపీటీ ప్లస్ ద్వారా అధునాతన మోడళ్లు, సోరా ఆధారిత వీడియో జనరేషన్, కోడెక్స్, వేగవంతమైన రెస్పాన్స్ మరియు ఎక్కువ మెమరీ సదుపాయాలు లభిస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది

CM Sangma: మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్

Varanasi: వారణాసి సినిమాలోకి హాలీవుడ్ హీరోయిన్

చిరు – సింగీతం సినిమా.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే

Aggipette Macha: ఆ అమాయకపు తింగరి కోపం చెదిరిపోయింది.. ఆ మహామ్మారే బలితీసుకుంది

Loading...
Unable to load recommendations.
Follow Us