ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్!
చైనాకు చెందిన ఓ స్టార్టప్ రూపొందించిన AI పెట్ ట్రాన్స్‌లేటర్ ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. కుక్కలు, పిల్లుల అరుపులు, హావభావాలను విశ్లేషించి వాటి భావాలను 95 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదని కంపెనీ చెబుతోంది. స్మార్ట్ కాలర్, మొబైల్ యాప్ సాయంతో జంతువులు-యజమానుల మధ్య సంభాషణను సులభతరం చేస్తుందని పేర్కొంటుండగా, ఈ వాదనలపై నిపుణులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులు ఏం ఆలోచిస్తున్నాయి, వాటికి ఏం కావాలో అర్థం చేసుకోవడం చాలా మంది యజమానులకు ఒక పెద్ద సవాలు. అవి చేసే శబ్దాలను, వాటి భావాలను మనం అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా! సరిగ్గా అలాంటి ఆలోచనతోనే చైనాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ AI ఆధారిత పెట్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. చాలా సినిమాల్లో జంతువులు మనుషులతో మాట్లాడుతుంటాయి. ఇప్పుడు అది నిజ జీవితంలో కూడా జరగబోతోంది. జంతువులు మనతో మాట్లాడే రోజులు వచ్చేశాయి..ఆ ఊహే ఎంత బాగుందో కదా! అదే నిజం కానుంది. ఒక చైనీస్ స్టార్టప్ కంపెనీ అటువంటి AI పెంపుడు జంతువుల ట్రాన్స్‌లేటర్‌ను సృష్టించింది. అది జంతువుల శబ్దాలు, భావోద్వేగాలు, వాటి ప్రవర్తనను దాదాపు 95 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ పరికరం పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య సంభాషణను ఈజీ చేయగలదని ఆ కంపెనీ చెబుతోంది. అలీబాబా క్లౌడ్ ఏఐ సాంకేతికతతో పనిచేసే ఆ స్మార్ట్ కాలర్ పరికరం.. జంతువుల అరుపులు, వాటి శరీర కదలికలను బట్టి అవి ఆకలితో ఉన్నాయా.. సంతోషంగా ఉన్నాయా.. అని సుమారు 95 శాతం కచ్చితత్వంతో కనిపెడుతుంది. వాటి హావభావాలను మైక్రో ఫోన్లు, మోషన్ సెన్సార్ల ద్వారా 1.2 సెకన్లలోనే పసిగట్టి.. ‘నన్ను ఒంటరిగా వదిలేయ్’, ‘నాతో ఆడుకో’ వంటి భావాలను వాక్యాల రూపంలోకి మార్చి, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా యజమానులకు వినిపిస్తుంది. యజమానులు మాట్లాడే మాటలను కూడా జంతువులకు అర్థమయ్యే ‘పెట్ ఫ్రెండ్లీ’ శబ్దాలుగా ఈ గ్యాడ్జెట్ మార్చగలదట. అంటే రెండు వైపులా మాట్లాడుకోవచ్చన్నమాట!.. ఇందుకోసం దాదాపు 10 లక్షల జంతువుల వాయిస్ డేటా శాంపిల్స్ సేకరించి ఏఐ మోడల్‌కు శిక్షణ ఇచ్చారు. దాదాపు 14 వేల రూపాయలకు లభిస్తున్న ఈ గ్యాడ్జెట్‌కు సోషల్‌మీడియాలో మంచి స్పందన వస్తోంది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిరోజులకే 10వేల మందికి పైగా ముందుస్తు ఆర్డర్లు ఇచ్చేశారు. ‘‘మనుషుల మాటలనే ఏఐ సరిగా అర్థం చేసుకోలేక పోతోంది. అలాంటిది కుక్కలు, పిల్లుల భాషను కనిపెట్టేసిందా ?’’ అంటూ కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీపై టెకీ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు, పరిశోధన పత్రాలు లేకుండానే 95శాతం కచ్చితత్వం ఉందని కంపెనీ ఎలా చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. జంతువుల హావభావాలను అంత సులభంగా మాటల్లోకి మార్చడం సాధ్యం కాకపోవచ్చని కొట్టిపారేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం నుంచి చూస్తే ‘భారత్-పాక్’ సరిహద్దు ఎలా ఉందో తెలుసా?
రూ.1.1 లక్షల కోట్లు.. ఈ డబ్బుకు వారసులెవరు?
లక్షలు ఖర్చు పెట్టే ఏసీ ఎందుకు..? కూలర్ అనే బెస్ట్ ఆప్షన్ ఉండగా అంటున్న నిపుణులు
తినడం రాంగ్ టైమ్ లో.. పడుకోవడం రాంగ్ టైమ్ లో.. దెబ్బతింటున్నపేగు ఆరోగ్యం
