భారత్‌ Vs న్యూజిలాండ్‌.. మైదానంలో బిగ్ ఫైట్‌ను ఆపిన కోహ్లీ

Updated on: Nov 15, 2026 | 12:42 PM

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో గుర్‌నూర్ బ్రార్, టిమ్ సీఫెర్ట్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. వికెట్ తీసిన తర్వాత బ్రార్ ఇచ్చిన సెండ్‌ఆఫ్‌తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ జోక్యం చేసుకుని యువ బౌలర్‌ను వెనక్కి లాగడంతో ఘటన చర్చనీయాంశంగా మారింది.

క్రికెట్ మైదానంలో దూకుడుండటం సహజం.. కానీ ఆ దూకుడు హద్దులు దాటితే ఏమవుతుంది? సరిగ్గా భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే అందర్నీ షాక్‌కు గురిచేసింది. యువ సంచలనం గుర్‌నూర్ బ్రార్, కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా యంగ్ పేసర్ గుర్‌నూర్ బ్రార్ బౌలింగ్‌లో సీఫెర్ట్ చెలరేగిపోయి కొన్ని అద్భుతమైన బౌండరీలు బాదాడు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం మొదలైంది. కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సీఫెర్ట్, బ్రార్‌పై తన దూకుడును ప్రదర్శించాడు. గుర్‌నూర్ బ్రార్ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. సీఫెర్ట్‌ను ఔట్ చేసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. వికెట్ దక్కిన ఆనందంలో బ్రార్ హద్దులు మీరి మరీ సీఫెర్ట్ దగ్గరకు వెళ్లి అగ్రెసివ్ సెండ్‌ఆఫ్ ఇస్తూ రెచ్చిపోయాడు. దీంతో కోపగించుకున్న సీఫెర్ట్ కూడా బ్రార్ వైపు సీరియస్‌గా వెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటేలా కనిపించింది. పెద్ద గొడవ జరిగేలా ఉన్న ఆ సమయంలోనే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు మైదానంలో ఇలాంటి అగ్రెషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు సీనియర్‌గా బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. గొడవ పెద్దదవుతుందని పసిగట్టిన కోహ్లీ, వెంటనే పరుగున వచ్చి గుర్‌నూర్ బ్రార్‌ను పట్టుకుని వెనక్కి లాగాడు. యువ ఆటగాడి దూకుడు వల్ల అనవసరమైన సస్పెన్షన్లు లేదా జరిమానాలు పడకుండా చాకచక్యంగా అడ్డుకున్నాడు. అటు ఆన్-ఫీల్డ్ అంపైర్ క్రిస్ బ్రౌన్ కూడా బ్రార్‌ను గట్టిగా మందలించారు. ఒకనాడు మైదానంలో గొడవలకు దిగే కోహ్లీ, ఇవాళ పీస్‌మేకర్‌గా మారి యువ ఆటగాళ్లకు అడ్డు నిలవడం చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంజీరా నీళ్లు బంద్! సైబరాబాద్‌లో ఏం జరగబోతోంది? జనవరి నుంచి గడ్డుకాలమేనా?

పుష్ప సినిమాకు మించిన స్కెచ్‌.. మామూలుగా లేదుగా!

పండగ పేరుతో విచ్చలవిడి ఖర్చులు! ఈ తప్పు మీరూ చేస్తున్నారా?

ఇదెక్కడి గోల.. రెండేళ్ల కిందటి కరెంట్ బిల్లు ఇప్పుడు కట్టాలా?

బాసరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి కొత్త రూట్ వచ్చేసింది

Loading...
Unable to load recommendations.
Follow Us