Virat Kohli: అమ్మకానికి కోహ్లీ కార్… దీని ధర ఎంతో తెలుసా.. వీడియో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న అత్యంత ఖరీదైన కారు ఎప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? అప్పట్లోనే ఎంత ధర పెట్టి కొన్నాడో తెలుసా? కార్లంటే అమితంగా ఇష్టపడే కోహ్లీ ఖరీదైన కార్లను కొనేసుకుని తన షెడ్లో పెట్టుకుంటాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న అత్యంత ఖరీదైన కారు ఎప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? అప్పట్లోనే ఎంత ధర పెట్టి కొన్నాడో తెలుసా? కార్లంటే అమితంగా ఇష్టపడే కోహ్లీ ఖరీదైన కార్లను కొనేసుకుని తన షెడ్లో పెట్టుకుంటాడు. ఒకప్పుడు అతడు నడిపిన ఆరెంజ్ కలర్ లంబోర్గిని గల్లార్డో స్పైడర్ కారు మాత్రం ప్రస్తుతం కొచ్చిలో అమ్మకానికి ఉందట. ఈ లంబోర్గిని కారును 2015లో కోహ్లీ కొన్నాడు. కొంతకాలం ఉపయోగించిన తర్వాత దాన్ని అమ్మేశాడు. పుదుచ్చేరి రిజిస్టర్డ్ కారు ప్రస్తుతం కొచ్చిలోని ఓ ప్రీమియం, లగ్జరీ కార్ల డీలర్ అయిన రాయల్ డ్రైవ్‌లో అమ్మకానికి ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కోటీ 35 లక్షలు పెట్టేసి కారును సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: Adivi Sesh: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో అడవి శేషు.. వీడియో