ఒక హత్య 100 ప్రశ్నలు.. మరోసారి చర్చనీయాంశంగా రాజీవ్‌గాంధీ మృతి

Updated on: Nov 25, 2026 | 1:35 PM

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన తండ్రి భద్రతను ఉద్దేశపూర్వకంగా తొలగించారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ విషయాలు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగి దశాబ్దాలు గడుస్తున్నా, ఆ ఘటన వెనుక ఉన్న మిస్టరీలు, అనుమానాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ ప్రచురణతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. “ఒక హత్య, 100 ప్రశ్నలు” అన్నట్టుగా, తన తండ్రిని హత్య చేసేందుకే ఉద్దేశపూర్వకంగా భద్రతను తొలగించారని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. రాజీవ్ హత్యకు భద్రతను తొలగించడమే కారణమని, అది కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని రాహుల్ స్పష్టం చేశారు. హత్యకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం కోసమే భద్రత తొలగింపు జరిగిందని ఆయన ఆరోపించారు. తల్లి సోనియా, చెల్లి ప్రియాంకతో కలిసి బిలాంగింగ్ ఆత్మకథపై చేసిన వీడియోలో రాహుల్ ఈ కీలక విషయాలు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?

Published on: Nov 25, 2026 01:32 PM
Loading...
Unable to load recommendations.
Follow Us