Brahmayoni Hill: మధుమేహాన్ని తగ్గించే అరుదైన మొక్కను కనుగొన్న శాస్త్రవేత్తలు.!

|

Aug 13, 2024 | 7:28 PM

డయాబెటిస్‌ను తగ్గించే లక్షణం ఉన్న గుర్మార్ అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. బీహార్ రాష్ట్రంలోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై పలు రకాల ఔషధ మొక్కలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిలో గుర్మార్ మొక్క కూడా ఉన్నట్టు తెలిపారు. మధుమేహ చికిత్స కోసం బీజీఆర్-34 అనే ఔషధం తయారీకి గుర్మార్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది.

డయాబెటిస్‌ను తగ్గించే లక్షణం ఉన్న గుర్మార్ అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. బీహార్ రాష్ట్రంలోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై పలు రకాల ఔషధ మొక్కలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిలో గుర్మార్ మొక్క కూడా ఉన్నట్టు తెలిపారు. మధుమేహ చికిత్స కోసం బీజీఆర్-34 అనే ఔషధం తయారీకి గుర్మార్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది. ఫలితంగా తీపి పదార్థాలు తినాలన్న కోరికను అది తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడానికి దోహదం చేస్తుంది. బ్రహ్మయొని పర్వతంపై గుర్తించిన పిథెసెలొబియం డుల్సే, జిజుఫస్ జుజుబా వంటి మొక్కల్లోని ఔషధ గుణాలపైనా పరిశోధనలు జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి అంతరించిపోకుండా స్థానికుల సాయంతో వాటిని సాగు చేయించాలని యోచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on