డిగ్రీ అర్హతతో రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. RRB NTPC నోటిఫికేషన్ విడుదల!

Updated on: Oct 14, 2026 | 9:06 PM

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు RRB NTPC నోటిఫికేషన్‌ కీలక అవకాశం. మొత్తం 3,548 గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు సమాచారం. గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌, సీనియర్‌ క్లర్క్‌, జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్‌ రీజియన్‌లో 56 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు నవంబర్‌ 6 చివరి తేదీగా ఇచ్చారు. అర్హతలు, వయోపరిమితి, ఫీజు వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలి.

నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తీపి కబురు అందించింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ విభాగంలో మొత్తం 3,548 ప్రాధాన్య పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా గుడ్స్ ట్రైన్ మేనేజర్ , సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ , జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ , చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సికింద్రాబాద్ రీజియన్‌లో 56 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులు 2027 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. దివ్యాంగులు, మాజీ సైనికులు, రైల్వే ఉద్యోగులు తదితరులకు నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది. ఒక్క అభ్యర్థి ఒక ఆర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే అవి తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ.250. సీబీటీ-1 పరీక్షకు హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం ఫీజు రీఫండ్ అవుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.29,200 నుండి రూ.35,400 వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 8, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ నవంబర్ 6, 2026. ఫీజు చెల్లింపునకు నవంబర్ 8 వరకు, దరఖాస్తుల సవరణకు నవంబర్ 9 నుంచి 18 వరకు గడువు ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్షలాదిమంది మనసు గెలిచిన అమ్మ.. బిడ్డను వీపుపై మోస్తూ..

Loading...
Unable to load recommendations.
Follow Us