CM Chandrababu: సీఎం చంద్రబాబుకు నమస్తే చెప్పిన రోబో.. వీడియో వైరల్..
సీఎం చంద్రబాబుకు రోబో నమస్కారం పెట్టింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు సైతం ప్రతిగా నమస్కారం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..
ఏపీ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో సీఎం చంద్రబాబు దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న ఒక ఆసక్తికర సంఘటన అందరినీ ఆకట్టుకుంది. ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు వివిధ ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక రోబో ఆయనకు అభివాదం చేస్తూ నమస్కరించింది. దానికి ప్రతిగా సీఎం చంద్రబాబు కూడా ఆ రోబోకు నమస్కరించారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో కొత్త సాంకేతికతలు, స్టార్టప్‌లు, పరిశోధనలను ప్రోత్సహించడానికి వివిధ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ హబ్ రాష్ట్రంలో టెక్నాలజీ, ఆవిష్కరణల రంగానికి కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

