రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా.. అంత తొందరేంటో..?

Updated on: Oct 12, 2026 | 11:57 AM

జైలర్ 2 అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమవుతుండగా, ఇప్పుడే జైలర్ 3పై చర్చ మొదలైంది. దర్శకుడు నెల్సన్ జైలర్ 3కి సంబంధించిన ఒక క్రేజీ ఐడియాను రజినీకాంత్‌కు చెప్పి ఒప్పించారనే ప్రచారం జరుగుతోంది. జైలర్ 2 విజయంపైనే మూడో భాగం ఆధారపడి ఉంది. దీనికి సంబంధించిన హింట్‌ను జైలర్ 2 క్లైమాక్స్‌లో ఇవ్వబోతున్నట్లు సమాచారం.

“జైలర్ 3” కూడా వస్తుందా? “జైలర్ 2” ఇంకా థియేటర్లలోకి రాకముందే ఈ చర్చ ఏంటి అనిపిస్తుంది. కానీ సినీ పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఈ అనుమానాలు రావడం సహజమే. దర్శకుడు నెల్సన్ ఇప్పటికే “జైలర్ 3″కి సంబంధించిన ఒక అద్భుతమైన ఆలోచనను తలైవా రజినీకాంత్‌కు చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. అంతా కుదిరితే “జైలర్ 2” క్లైమాక్స్‌లోనే మూడో భాగానికి సంబంధించిన హింట్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తనను బయటపడేసిన సినిమా కాబట్టి “జైలర్” అంటే రజినీకాంత్‌కు ప్రత్యేకమైన అభిమానం. ఈ సినిమా సీక్వెల్ “జైలర్ 2” అక్టోబర్ 15న విడుదల కానుంది. దీనికోసం రజినీకాంత్‌తో పాటు నెల్సన్ కూడా భారీ పారితోషికం తీసుకున్నారని సమాచారం. తెలుగులో ఈ సినిమా హక్కులను నాగవంశీ మంచి రేటుకు దక్కించుకోవడంతో ఇక్కడ కూడా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us