ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా’ ఫుడ్స్

Updated on: Feb 06, 2026 | 9:45 AM

యోగాకు ముందు శరీరాన్ని సిద్ధం చేయడానికి తేలికైన, పోషకమైన ఆహారం అవసరం. ఇవి తక్షణ శక్తినిచ్చి, కడుపులో అసౌకర్యం లేకుండా యోగా సాధనకు తోడ్పడతాయి. అవకాడొ, అరటిపండు, యాపిల్, నానబెట్టిన బాదం వంటివి కండరాల పుష్టిని, ఏకాగ్రతను పెంచి, అలసటను తగ్గిస్తాయి. యోగాకు 30-45 నిమిషాల ముందు వీటిని తీసుకోవడం ఉత్తమం.

యోగాకు ముందు ఎలాంటి ఆహారం తినకూడదని చాలామంది భావిస్తుంటారు. కానీ వ్యాయామానికి ముందు శరీరానికి ఇంధనం అవసరమైనట్లే, యోగ సాధనకు ముందు కూడా కొన్ని తేలికైన, పోషకాహారాలు అవసరమవుతాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తూనే కడుపులో అసౌకర్యం కలగకుండా ఉత్సాహంగా ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కండరాల పుష్టికి అవకాడొ ఎంతో దోహదం చేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది, ఎక్కువసేపు ఆకలి వేయనివ్వదు. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండులోని పొటాషియం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది కండరాల నొప్పులు, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. నేరుగా లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు. ఇది గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించి అలసటను తగ్గిస్తుంది. యాపిల్ క్షార గుణం కలిగి ఉండటంతో ఆమ్లత్వాన్ని నివారిస్తుంది. ఇందులోని సహజ చక్కెరలు, పీచు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. విటమిన్–సి, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల దాహాన్ని తగ్గించి చురుకుదనాన్ని పెంచుతుంది. యోగాకు ముందు నాలుగు నానబెట్టిన బాదం పప్పులు తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో విటమిన్–ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటంతో ఏకాగ్రత, శారీరక దృఢత్వం పెరుగుతాయి. ఉప్పు లేదా వేయించిన బాదం తినకూడదు. యోగ సాధనలో పూర్తి ప్రయోజనం పొందాలంటే ఈ ఆహారాలను యోగాకు 30–45 నిమిషాల ముందు తీసుకోవడం మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు ఉన్నా నిపుణులను సంప్రదించి తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్

కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది

Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !

Loading...
Unable to load recommendations.
Follow Us