MLA అరవ శ్రీధర్ – వీణ ఎపిసోడ్ లో కీలక పరిణామం
రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణ ఎపిసోడ్‌లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. గత రెండు రోజులుగా వీణ మౌనంగా ఉండగా, ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉద్యోగపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వీణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవాలని కోరుతున్నారు. పోలీసులు, జనసేన విచారణ కమిటీ నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.
రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. వరుస సెల్ఫీ వీడియోలతో సంచలనం సృష్టించిన వీణ గత రెండు రోజులుగా మౌనంగా ఉంది. ఆమె చివరి వీడియోలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవాలని కోరారు. తన సమస్య పవన్ పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించినదని పేర్కొన్నారు. ఈలోగా, వీణపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పోలీసుల విచారణకు హాజరు కావాలని కోరినా ఆమె స్పందించలేదు. గతంలో ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఫిర్యాదు చేసేటప్పుడు కూడా స్టేషన్‌కు నేరుగా రాలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Botsa Satyanarayana: కూటమి వచ్చాక.. ఒక్క కొత్త పెన్షనూ లేదు
మల్లారెడ్డి యూనివర్సిటీలో శివరాత్రి జాగరణ కార్యక్రమం
Lok Sabha: లోక్ సభ లో.. జగడ జగడ జగడం