Kamareddy: కామారెడ్డిలో కొత్త రాజకీయం.. హాట్ సీట్‌లో బిగ్ పొలిటికల్ ఫైట్ – Watch Video

Updated on: Nov 15, 2023 | 6:46 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడి నుంచి కేసీఆర్‌తో తలపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ నియోజకవర్గం తెలంగాణలోనే హాట్ సీట్‌‌గా మారింది. తెలంగాణతో పాటు యావత్ దేశం దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం వైపు నెలకొంది. మరి ఈ హాట్‌ సీట్‌ కామారెడ్డిలో రాజకీయ ఉద్ధండుల ఫ్యూచ‌ర్ ఏంటి?

పాత నేతలు పోయి కొత్త అభ్యర్థులు తెరపైకొచ్చారు. మూడు దశాబ్దాలుగా తమ రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న నియోజకవర్గానికి అనుకోకుండా ఆ ఇద్దరూ దూరమయ్యారు. దశాబ్దాలుగా నువ్వానేనా అంటూ తలపడుతున్న నేతలు.. ఇప్పుడు అగ్రనేతల గెలుపు బాధ్యతని భుజాలకెత్తుకున్నారు. అదే కామా రెడ్డి నియోకవర్గం. దశాబ్ధాలుగా గంప గోవర్థన్, షబ్బీర్ అలీ ఈ నియోజకవర్గంలో తలపడ్డారు. ఇప్పుడు వారు తమ సీట్లను పార్టీ పెద్దల కోసం వదులుకున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడి నుంచి కేసీఆర్‌తో తలపడుతున్నారు. అటు బీజేపీ నుంచి నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ వెంకట రమణా రెడ్డి పోటీ చేస్తున్నారు. రాజకీయ ఉద్ధండులు బరిలో నిలవడంతో ఇప్పుడు ఈ నియోజకవర్గం తెలంగాణలోనే హాట్ సీట్‌‌గా మారింది. తెలంగాణతో పాటు యావత్ దేశం దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం వైపు నెలకొంది. మరి ఈ హాట్‌ సీట్‌ కామారెడ్డిలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది..? ఇప్పుడు వీడియోలో చూద్దాం..

Loading...
Unable to load recommendations.
Follow Us