Budget 2024: బడ్జెట్ 2024 ఏపీకి ఏమిస్తారు.? చాలా ఆశలు పెట్టుకున్న ఏపీ..

|

Jul 20, 2024 | 9:59 AM

అన్ని ఆశలు.. ఆమెపైనే.. ఆమె తీసుకొచ్చే రెడ్ పౌచ్‌లో.. చదివే ట్యాబ్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెబుతారా అని..? విభజన జరిగి పదేళ్లయినా ఇంకా అభివృద్ధి బాట పట్టని రాష్ట్రాన్ని ఎలా పట్టాలెక్కిస్తారా అని.. అదృష్టవశాత్తు ఏపీలో అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావడం.. టీడీపీ-జనసేన సపోర్ట్‌ కేంద్రంలో కీలకం కావడంతో.. గత ఐదేళ్లలో పెద్దగా వినిపించని గుడ్ న్యూస్‌లు ఈ సారి వినిపించే అవకాశం ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.

అన్ని ఆశలు.. ఆమెపైనే.. ఆమె తీసుకొచ్చే రెడ్ పౌచ్‌లో… చదివే ట్యాబ్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెబుతారా అని..? విభజన జరిగి పదేళ్లయినా ఇంకా అభివృద్ధి బాట పట్టని రాష్ట్రాన్ని ఎలా పట్టాలెక్కిస్తారా అని… అదృష్టవశాత్తు ఏపీలో అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావడం… టీడీపీ-జనసేన సపోర్ట్‌ కేంద్రంలో కీలకం కావడంతో.. గత ఐదేళ్లలో పెద్దగా వినిపించని గుడ్ న్యూస్‌లు ఈ సారి వినిపించే అవకాశం ఉందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. దానికి తోడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనదైన మార్క్ చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, పరిచయాలను, తన వర్క్ స్టైల్‌ను ఈ ప్లస్ పాయంట్లన్నింటినీ ఉపయోగించుకొని ఢిల్లీ వెళ్లి… రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా , ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ సహా రక్షణ, వాణిజ్య, రహదారులు రవాణా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, ఇంధన, పెట్రోలియం శాఖల మంత్రులను స్వయంగా కలిసి రాష్ట్ర స్థితిగతులను వివరించారు.

ఆయా రంగాల్లో అందించవలసిన సాయంపై వారందరికీ వినతి పత్రాలు అందించారు. వీరందరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యల తీవ్రతను వారి దృష్టికి తీసుకెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. వీరితోపాటు 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగరియాతో సైతం సమావేశం అయ్యారు. ఈ పర్యటనలోనే ఆయన పలువురు పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అంతేకాదు.. కేంద్రస్థాయిలో ఉన్న సీనియర్‌ అధికారులకు విందు ఏర్పాటు చేసి తన రాష్ట్రానికి సహాయం చేయడంలో త్వరితగతిన స్పందించాలని కోరారు. ఈ విషయంలో తన సీనియారిటీని, పేరు ప్రఖ్యాతల్ని అన్నింటినీ పక్కనపెట్టి.. ఒక్క ముక్కలో చెప్పాలంటే తనకన్నా జూనియర్లను కూడా ఎలాంటి భేషజాలు లేకుండా కలిసి రాష్ట్ర అవసరాలను వివరించారు. ఓ రకంగా చంద్రబాబునాయుడులో ఉన్న ప్లస్ ఇదే. అనవసరమైన ఇగోలుండవు. అక్కర్లేని భేషజాలు ఉండవు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన తన విజన్ ప్రకారం ముందుకెళ్తుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.