మళ్లీ వచ్చిన మహమ్మారి.. ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్‌

Updated on: Nov 15, 2026 | 11:34 AM

కరోనా PJ.2.1 అనే కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతోంది. కెనడాలో గుర్తించిన ఈ వైరస్ అమెరికా, యూరప్, ఆసియా దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. స్పైక్ ప్రోటీన్‌లో జన్యుమార్పులతో ఇది సులభంగా మనుషుల్లోకి ప్రవేశిస్తుందని పరిశోధకులు అంటున్నారు. జ్వరం, దగ్గు, అలసట దీని లక్షణాలు. 70 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోసారి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. PJ.2.1 అనే కొత్త వేరియంట్ ఇప్పుడు వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. తొలిసారి కెనడాలో గుర్తించిన ఈ వైరస్ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు పలు ఆసియా దేశాలకూ పాకింది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఆరోగ్య నిపుణులు తీవ్ర అప్రమత్తత ప్రకటించారు. పరిశోధకుల ప్రకారం, PJ.2.1 వేరియంట్‌లోని స్పైక్ ప్రోటీన్‌లో గణనీయమైన జన్యు మార్పులు సంభవించాయి. దీనివల్ల ఈ వైరస్ మానవ కణాల్లోకి అత్యంత వేగంగా ప్రవేశించే సామర్థ్యాన్ని పెంచుకుందని ప్రాథమిక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులలో ఈ కొత్త వేరియంట్‌ను ఎక్కువగా గుర్తిస్తున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన అలసట వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాలతో పోలి ఉండటంతో, అనుమానం ఉన్న వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారానే దీనిని నిర్ధారించగలమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందే భారత్ స్లీపర్‌కు నో తత్కాల్‌..నో వెయిటింగ్‌ లిస్ట్‌!

అభిమానాలు లేక కాదు, సందర్భాలు కుదరాలి కదా! దటీజ్ పవన్ నైజం!

ఆయన సంపాదన.. ఈమె పాకెట్ మనీతో సమానమా?

గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు.. నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్..

62 ఏళ్ల వయసులో రొమాంటిక్ ఫోజులు.. ప్రియురాలితో గోవిందా వైరల్ పిక్స్!

Loading...
Unable to load recommendations.
Follow Us