పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
నాగార్జున సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం ఉధృతమైంది. తాగునీటి అవసరాల కోసం కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే రెండు రాష్ట్రాల అధికారులు పోటీపడి నీటిని విడుదల చేశారు. కుడి కాలువ ద్వారా ఏపీ 1500 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా తెలంగాణ 2000 క్యూసెక్కులు వదిలాయి. ఇది పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వివాదాన్ని మరింత పెంచుతోంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం తారాస్థాయికి చేరుకుంది. తాగునీటి అవసరాల పేరుతో రెండు రాష్ట్రాల అధికారులు పోటీపడి నీటిని విడుదల చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేఆర్ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) అనుమతులు లేకుండానే ఏపీ అధికారులు కుడి కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, దీనికి పోటీగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని వదిలారు. వేసవిలో తాగునీటి అవసరాల కోసం తెలంగాణ 21 టీఎంసీలు (హైదరాబాద్కు 15 టీఎంసీలు), ఏపీ 19 టీఎంసీల నీటిని కోరుతూ కేఆర్ఎంబీకి ఇండెంట్లు సమర్పించాయి. అయితే, ఈ ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేఆర్ఎంబీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇప్పటికే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న వివాదాల నడుమ, సాగర్ వద్ద తాజా నీటి విడుదల ఈ జల జగడాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 45 టీఎంసీల నీరు మాత్రమే ఉంది, ఇది కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని కేఆర్ఎంబీ సూచించింది. అయినప్పటికీ, రెండు రాష్ట్రాలు తమ అవసరాల కోసం నీటిని విడుదల చేయడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. క్రాస్ చెక్ చేయాల్సిందే
