హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ మైనర్ బాలుడు హైఎండ్ స్పోర్ట్స్ కారును అతివేగంగా నడిపిన ఘటన కలకలం రేపింది. బాలుడి తండ్రే స్వయంగా కారు స్టీరింగ్ అప్పగించి వెనుక సీట్లో కూర్చొని ప్రయాణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకుని తండ్రిపై చర్యలు చేపట్టారు.
పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులే దగ్గరుండి తప్పు చేయిస్తే ఏమనాలి? మైనర్లకు వాహనాలు ఇవ్వడమే నేరమైతే, ఏకంగా హైఎండ్ స్పోర్ట్స్ కారును చేతికిచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేయించాడో తండ్రి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఈ ప్రమాదకర ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఒక తండ్రి తన మైనర్ కొడుకు చేతికి ‘MG’ హైఎండ్ స్పోర్ట్స్ కారు స్టీరింగ్ ఇచ్చాడు. బాలుడు అతివేగంగా, ప్రమాదకరంగా కారు నడుపుతుంటే.. సదరు తండ్రి వెనుక సీట్లో కూర్చుని కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశాడు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు ఈ డేంజరస్ ఫీట్‌ను చూసి హడలిపోయారు. వెంటనే కొందరు దీనిని వీడియో తీసి పోలీసులకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై కేసు నమోదు చేశారు. ఆ విలాసవంతమైన కారును సీజ్ చేసి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన బాలుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు తల్లిదండ్రులు మారడం లేదని, ఇలాంటి వారు తమ పిల్లల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు వాహనాలిచ్చే పేరెంట్స్ విషయంలో ఇకపై మరింత కఠినంగా ఉంటామని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ.. లక్షల్లో నగదు, గోల్డ్ కొట్టేసిన కేటుగాడు
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
భార్యను వీపుపై మోసుకుని కలెక్టరేట్‌కు.. 10 ఏళ్లుగా న్యాయం కోసం కుటుంబం పోరాటం
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని.. చిన్న స్పార్క్ వచ్చినా ప్రమాదమే!
