డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!

Updated on: Nov 24, 2026 | 12:44 PM

మహారాష్ట్ర అకోలాలో డబ్బుల వర్షం కురిపిస్తామంటూ నిర్వహించిన అఘోరీ పూజల్లో యువకుడిని బలిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు హేమంత్ ప్రఫుల్ సప్కాల్. తాంత్రికుడు వివేక్ అలియాస్ విక్కీ షిండే అరెస్ట్ అయ్యాడు. వైరల్ వీడియోలు, హత్యకు సంబంధాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం కింద కేసు నమోదైంది.

మహారాష్ట్రలో రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వాలనే అత్యాశ, మూఢనమ్మకాలు ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్నాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అకోలా జిల్లాలో డబ్బుల వర్షం కురిపిస్తామంటూ నిర్వహించిన అఘోరీ పూజల పేరిట ఓ యువకుడిని బలిచ్చిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడిని హేమంత్ ప్రఫుల్ సప్కాల్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనుమానిత తాంత్రికుడు వివేక్ అలియాస్ విక్కీ షిండేను పోలీసులు అరెస్టు చేశారు. తాంత్రిక విద్యల ద్వారా డబ్బుల వర్షం కురిపించి అపారమైన సంపద పొందవచ్చని నమ్మించి ఈ పూజలు నిర్వహించినట్లు ప్రాథమిక సమాచారం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించినట్లు చెబుతున్న ఈ అఘోరీ పూజల సందర్భంగానే హేమంత్‌ను హత్య చేసి బలిచ్చారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అకోలా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాంత్రికుడు విక్కీ షిండే అఘోరీ పూజలు చేస్తున్న వైరల్ వీడియోలకు, హేమంత్ సప్కాల్ మృతికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us