Sugar benifits: చక్కెరతో ఇలా చేయండి.. మెరిసే అందం మీ సొంతం..! మాయిశ్చరైజర్‌లా పనిచేసే షుగర్‌..(వీడియో)

|

Oct 29, 2021 | 6:54 PM

ప్రతి ఒక్కరూ మెరిసే అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. కానీ మంచి చర్మ సౌందర్యం కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నపని. అయితే మీరు ఇంట్లో వాడే వస్తువులతోనే ఎంతో సులువుగా మీరు కోల్పోయిన చర్మ సౌందర్యాన్ని తిరిగి పొందవచ్చు తెలుసా..


ప్రతి ఒక్కరూ మెరిసే అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. కానీ మంచి చర్మ సౌందర్యం కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నపని. అయితే మీరు ఇంట్లో వాడే వస్తువులతోనే ఎంతో సులువుగా మీరు కోల్పోయిన చర్మ సౌందర్యాన్ని తిరిగి పొందవచ్చు తెలుసా.. అదేంటంటే.. చక్కెర.. దీనిని మించిన మాయిశ్చరైజర్‌ ఇంకొకటి ఉండదని చెప్పొచ్చు. షుగరేంటి.. మాయిశ్చరైజర్‌ ఏంటి అనుకుంటున్నారా… కానీ ఇది నిజం. చక్కని చర్మ సౌందర్యానికి చక్కెరను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఒక చెంచా పంచదార, ఒక చెంచా పెరుగు తీసుకొని రెండింటినీ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన రంధ్రాలలో దాగిన మురికి అంతా తొలగిపోయి మీ ముఖంపై గ్లో వస్తుంది. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ ఎల్లప్పుడూ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని చక్కెరతో కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే ముఖంపై ఉన్న మృతకణాలు తొలగి ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది. అర టీస్పూన్ నిమ్మరసాన్ని ఒక టీస్పూన్ పెరుగులో కలపి, ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి మెత్తగా మసాజ్ చేయండి. 10 నిమిషాల పాటు అప్లై చేసిన తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. పంచదారలో అర టీస్పూన్ నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి, 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే 1 టీస్పూన్ ముతక చక్కెరను తీసుకుని ఆపై కొద్దిగా బాదం నూనె, తేనె, కాఫీ కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దానిని ముఖానికి అప్లైచేసి 10 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత కడిగేస్తే ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)