కేరళ పాలిటిక్స్‌లో మారుతున్న సమీకరణాలు
కేరళ రాజకీయాల్లో మలయాళ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కదలికలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మోహన్‌లాల్ RSS అనుబంధ సంస్థ కార్యక్రమంలో ప్రసంగించడం, మమ్ముట్టి BJP నేత ఇంటికి వెళ్లడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సురేశ్ గోపి రాజకీయ విజయం నేపథ్యంలో, ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారతాయన్న ఊహాగానాలకు తెరలేపాయి.
కేరళ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపారు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి. వారి ఇటీవలి కార్యకలాపాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై తీవ్రమైన ఊహాగానాలకు దారితీశాయి. మోహన్‌లాల్ కోజికోడ్‌లో జరిగిన RSS అనుబంధ సంస్థ కేసరి కార్యక్రమంలో పాల్గొని, భారతీయ సంస్కృతి, వారసత్వం, దేశభక్తి గురించి శక్తివంతమైన ప్రసంగం చేశారు. ఆయన మాటలు రాజకీయాలకు సంకేతమా అని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, మెగాస్టార్ మమ్ముట్టి BJP కీలక నేత బి. గోపాలకృష్ణన్ ఇంటికి వెళ్లడం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీనికిముందు వాయనాడ్‌లో CPM నేతను పక్కకు జరగమనడం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఆయన ఫోజులు వంటి ఘటనలు వామపక్ష శిబిరంలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే సంకేతాలు పంపాయి. యాక్షన్ హీరో సురేశ్ గోపి ఇప్పటికే BJP తరఫున గెలిచి కేంద్ర మంత్రి కావడం ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసింది. మమ్ముట్టి, మోహన్‌లాల్ కూడా అదే బాటలో పయనిస్తున్నారా? కేరళలోని వామపక్ష కంచుకోటలు బీటలు వారుతున్నాయా? లేక ఇదంతా కేవలం రాజకీయ ఊహాగానం మాత్రమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం :
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి
