భీమేశ్వరుడి రథానికి హైడ్రాలిక్‌ బ్రేకులు

Updated on: Feb 14, 2026 | 9:45 AM

కాకినాడ జిల్లా కుమార రామ భీమేశ్వరాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. భక్తుల భద్రత దృష్ట్యా, రథోత్సవానికి అత్యాధునిక హైడ్రాలిక్ బ్రేకులు అమర్చారు. ఇదివరకు ప్రమాదకరమైన చెక్క మోకుల స్థానంలో ఈ కొత్త బ్రేకులు రథాన్ని సురక్షితంగా, నియంత్రితంగా నడపడానికి సహాయపడతాయి. ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు, ఇది ప్రశాంతమైన ఉత్సవాలకు భరోసా ఇస్తుంది.

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కుమార రామ భీమేశ్వరాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవంలో కీలక మార్పు చోటుచేసుకుంది. భక్తుల రక్షణే లక్ష్యంగా, భారీ రథానికి అత్యాధునిక హైడ్రాలిక్‌ బ్రేకులను ఏర్పాటు చేశారు . విశాఖపట్నంకు చెందిన జేవీవీ రావు అనే దాత సౌజన్యంతో ఈ బ్రేకులను రూపొందించారు. ఇప్పటివరకు రథోత్సవ సమయంలో రథాన్ని ఆపడానికి భక్తులు భారీ ‘చెక్క మోకులను’ చక్రాల కింద వేసేవారు. అయితే వర్షం కురిసి నేల తడిగా ఉన్నప్పుడు ఒక్కోసారి రథాన్ని వెంటనే ఆపటం బాగా కష్టమయ్యేది. పైగా ఇది కొంత ప్రమాదకరమైన పద్ధతి కూడా. అయితే ఇప్పుడు రెండు చక్రాలకు ఇరువైపులా హైడ్రాలిక్ బ్రేకులు అమర్చడం వల్ల, రథాన్ని కోరుకున్న వేగంతో నడిపించడమే కాకుండా, తక్షణమే నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ అధికారులు గురువారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. రథాన్ని షెడ్ నుండి శాస్త్రోక్తంగా పూజలు చేసి బయటకు తీసి, గాంధీ బొమ్మ వరకు నడిపారు. బ్రేకుల పనితీరు అత్యంత సమర్థవంతంగా ఉందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల రథం అదుపు తప్పకుండా ఉంటుందని, ఇరుకైన వీధుల్లో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రథోత్సవం ప్రశాంతంగా సాగుతుందని ఆలయ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్