ఇంటర్‌ పరీక్షల్లో భారీ మార్పులు!

Updated on: Sep 12, 2026 | 5:26 PM

ఇంటర్మీడియట్‌ విద్యలో బట్టీ విధానానికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల సరళిలో కొత్త విధానం అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ పరాఖ్‌ మార్గదర్శకాలు, జాతీయ విద్యా విధానం ప్రకారం 10 శాతం ప్రశ్నలను కొత్త తరహాలో రూపొందించనున్నారు. విద్యార్థులు కేవలం సమాధానాలను గుర్తుపెట్టుకోవడం కాకుండా, నేర్చుకున్న అంశాలను కొత్త పరిస్థితుల్లో ఎలా అన్వయిస్తారో పరీక్షించేలా ప్రశ్నలను రూపొందించనున్నారు.

ఇంటర్మీడియట్ విద్యలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న బట్టీ పద్ధతికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో కేవలం పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకునే గుడ్డి విధానాన్ని మాని, విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించేలా ప్రశ్నపత్రాల సరళిని పూర్తిగా మార్చనున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘పరాఖ్‌’ మార్గదర్శకాలు మరియు జాతీయ విద్యా విధానం ప్రకారం 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ప్రశ్నలు ఇస్తున్నారు. వీటిలో నుంచే పబ్లిక్‌ పరీక్షల్లోనూ ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను బట్టీ పట్టి పరీక్షల్లో రాసే పరిస్థితి ఉందని అధికారులు గుర్తించారు. దీనికి చెక్ పెట్టేలా ఇకపై ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను పూర్తిగా కొత్త తరహాలో రూపొందించనున్నారు. విద్యార్థి తాము నేర్చుకున్న అంశాన్ని కొత్త పరిస్థితుల్లో ఎలా అన్వయించగలడు, ఎంతవరకు అర్థం చేసుకున్నాడు అనే కోణంలో ఈ ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంక్‌ను తయారు చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది. అధ్యాపకుల నుంచి సృజనాత్మక ప్రశ్నలను సేకరించి, వచ్చే విద్యా సంవత్సరం ముద్రించే కొత్త పాఠ్యపుస్తకాల చివర వాటిని చేర్చనున్నారు. ఈ మార్పుల ద్వారా విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, ఆలోచనా నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలోనే విద్యార్థులు ఈ కొత్త విధానానికి అలవాటుపడేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!

62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్‌.. నీతా అంబానీ ఫిట్‌నెస్ రహస్యం ఇదే!

కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్‌ బాస్‌!

అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు

Loading...
Unable to load recommendations.
Follow Us