Guntur: వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..

Updated on: Oct 01, 2026 | 9:47 PM

గుంటూరులో ఆసుపత్రి నుంచి డయాలసిస్‌ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందారు. ఐపిడి కాలనీకి చెందిన హరికృష్ణ తన కుమారుడు అఖిలేష్‌తో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఆటోమేటిక్‌ డోర్లు లాక్‌ కావడంతో ఇద్దరూ బయటకు రాలేకపోయారు. స్థానికులు అద్దం పగలగొట్టి అఖిలేష్‌ను బయటకు తీశారు. వెనుక సీటులో ఉన్న హరికృష్ణను మాత్రం కాపాడలేకపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుని తిరిగి వస్తుండగా, కొద్ది క్షణాల్లో ఇంటికి చేరుతామనగా కారులో హఠాత్తుగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమైన విషాద సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది. గుంటూరు ఐపిడి కాలనీకి చెందిన హరికృష్ణ కాటన్ బయ్యర్‌గా పనిచేసేవారు. కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు సమస్య తీవ్రత పెరగడంతో క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నారు. తండ్రిని చూసుకునేందుకు ఆయన కుమారుడు అఖిలేష్ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో డయాలసిస్ కోసం తండ్రీకొడుకులిద్దరూ కారులో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అయితే డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లే సమయానికి కారులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. ఆటోమేటిక్ డోర్స్ కూడా లాక్ అయిపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి డ్రైవింగ్ సీట్లో ఉన్న అఖిలేష్ వైపు ఉన్న అద్దాన్ని పగలగొట్టి అతడిని బయటకు తీశారు. దీంతో అఖిలేష్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ, వెనుక సీట్లో ఉన్న హరికృష్ణ వైపు వెళ్లేసరికి మంటలు తీవ్రంగా వ్యాపించాయి. స్థానికులు ఎంత ప్రయత్నించినా మంటల తీవ్రత వల్ల ఆయనను కాపాడలేకపోయారు. మంటలు అదుపులోకి వచ్చేసరికి హరికృష్ణ కారులోనే కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. డీజిల్ కారులోని ఏసీ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!

Maremma Jatara: ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!

ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ

మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ! చివరికి ఏమైందంటే?

సూపర్ మార్కెట్‌ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!

Loading...
Unable to load recommendations.
Follow Us