టాక్సిక్ టీజర్‌లో ఆ హీరోయిన్లను గమనించారా..?

Updated on: Feb 22, 2026 | 12:45 PM

మోస్ట్ అవైటెడ్ టాక్సిక్ టీజర్ విడుదలైంది. యష్‌ను కొత్త లుక్‌లో చూసి అభిమానులు షాకయ్యారు. 1940-70ల నాటి గోవా మాఫియా డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వైలెంట్ కథాంశంతో రూపొందుతోంది. రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా, నయనతార, హ్యూమా ఖురేషి వంటి హీరోయిన్లు ఉన్నా వారిని టీజర్‌లో రివీల్ చేయలేదు.

మోస్ట్ అవైటెడ్ యష్ చిత్రం టాక్సిక్ టీజర్ విడుదలైంది. మొదటి టీజర్ చూసిన తర్వాత యష్‌లోని మార్పును చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. రెండవ టీజర్ విడుదలయ్యాక, యష్ పూర్తిగా మారిపోయాడని స్పష్టమైంది. టీజర్‌లో కొన్ని విషయాలు బయటపెట్టగా, మరికొన్నింటిని దాచి ఉంచారు. ఇది కుటుంబ కథా చిత్రం కాదని, పక్కా వైలెంట్ కథాంశంతో అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందిందని మేకర్స్ మొదటి టీజర్‌తోనే స్పష్టం చేశారు. తాజా టీజర్‌లో కథకు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. విజువల్స్, కలర్ గ్రేడింగ్, యాక్షన్ సీక్వెన్స్, ఓవరాల్ మేకింగ్ అన్నీ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?

ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!

టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్

క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే

Follow Us