Keerthy Suresh: కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు.. అస్సలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు

Updated on: Oct 08, 2025 | 12:52 PM

కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా ఉంటూ ట్రెడీషినల్ రోల్స్‌కి ప్రాధాన్యత ఇస్తూ.. తన నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది ఈ అమ్మాయి. మహానటి లాంటి సినిమాలతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గ్లామర్ వైపు దృష్టి మళ్లించినట్టుంది.

ఆన్‌ స్క్రీన్‌ పై హద్దులు దాటేయడం ఇప్పటికే షురూ చేసింది. మహానటి తర్వాత ఆమెకు వచ్చిన గౌరవం, గుర్తింపు, ఇమేజ్ అన్నీ వేరే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ ఇమేజ్‌కి పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది కీర్తి సురేష్. సినిమాలు తక్కువగా ఉన్నా, కీర్తి సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రతి కొత్త ఫోటోషూట్‌తోనూ ఆమె లుక్ మారిపోతూ ఉండటంతో, అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. సాధారణంగా హీరోయిన్లు అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తారు. కానీ కీర్తి విషయంలో అలా అనడం కష్టం.ఎందుకంటే ఆమెకు ఇప్పటికీ మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయినా కొన్ని సినిమాలకు నో చెప్పింది.. ఇంకా చెప్తుంది కూడా…! అదే సమయంలో గ్లామర్ డోస్ మాత్రం భారీగా పెంచేసింది. ఈ మార్పు వెనుక అసలు ఏముంది అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. ట్రెండ్‌లో ఉండాలనే ఉద్దేశంతో కీర్తి ఈ కొత్త స్టైల్‌కి వెళ్లిందా అనే అనుమానాలు వస్తున్నాయి. కీర్తి తన ఇమేజ్‌ని కొత్తగా రీడిఫైన్‌ చేసుకోవాలని అనుకుంటోందని.. అందుకే ఇలా రెచ్చిపోతుందంటున్నారు కొందరు. మ్యాటర్ ఏదైనా.. ఆమె ప్రతి అప్‌డేట్‌కి నెటిజన్లు మాత్రం ఫుల్ హ్యాపీస్. ఫ్యాషన్ ఫోటోషూట్లు, గ్లామరస్ అవుట్‌ఫిట్స్, కొత్త మేకోవర్ ఇవన్నీ కీర్తి ఇప్పటి ఇమేజ్‌ను మార్చేసాయి. కొంతమంది అభిమానులు ఈ మార్పుని ఎంజాయ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం మహానటిలో కనిపించిన సాఫ్ట్ లుక్ మిస్ అవుతున్నామని చెబుతున్నారు. అయితే కీర్తి ఈ మార్పుతో ఏమి చెప్పాలనుకుంటోందో అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెలకు రూ.30లక్షల జీతాన్ని వదిలి.. హీరోగా మారిన కుర్రాడు

Kantara: Chapter 1: 1000 కోట్లా.. అంత సీన్‌ ఉందంటారా ??

నెల తిరగకుండానే OTTలోకి OG ?? బయటికొచ్చిన డేట్ !!

బాబుకు దక్కాల్సింది తరుణ్‌ ఎగరేసుకుపోయాడు !! ఇదే లక్కంటే !!