CM Vijay: 0277′ విజయ్‌ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ

Updated on: May 14, 2026 | 8:02 PM

తమిళ నటుడు విజయ్ వాడే ప్రతి వాహనంపై కనిపించే ‘0277’ నెంబర్ వెనుక ఓ భావోద్వేగ కథ దాగి ఉంది. తన చెల్లెలు విద్య జ్ఞాపకార్థంగా ఈ నెంబర్‌ను ప్రతి కారుకు, ప్రచార రథానికి కూడా రిజిస్ట్రేషన్‌గా తీసుకుంటున్నారని సమాచారం వెలుగులోకి రావడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. విజయ్ చెల్లెలు 1977లో మరణించగా, ఆ జ్ఞాపకాన్ని జీవితాంతం తనతో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ నెంబర్‌ను వాడుతున్నారని తెలుస్తోంది.

తమిళ నటుడు విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండేళ్ల క్రితం పార్టీని స్థాపించిన విజయ్ తొలి ప్రయత్నం లోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రికార్డు సాధించారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే… రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, విజయ్‌ తను వాడే వెహికిల్స్ అన్నింటికి ఓకే నెంబర్‌ను వాడుతుంటాడు. అది విజయ్ ప్రయాణించే కార్లే కానీ.. ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన బస్సే కానీ.. తను కొనే ఏ వెహికిలే కానీ.. ఓకే నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేపింస్తుంటాడు. ఓకే నెంబర్ వచ్చేలా జాగ్రత్త పడుతుంటాడు. ఆ నెంబరే 0277. అయితే విజయ్‌ ఈ నెంబరే ఏరి కోరి తీసుకోవడం వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ ఉంది. అదే ఇప్పుడు బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు, సినిమా నటులు వాడే కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండడం గమనించే ఉంటారు.. ఒక్కొక్కరికి ఒక్క నెంబర్ సెంటిమెంట్ గా ఉంటుంది.. రాజకీయ నాయకులకు కూడా తమకార్లకు ఓకే నంబరు ఉండేలా చూసుకుంటుంటారు.. అది వారికి కలిసి వచ్చిన నంబర్ గా భావిస్తూ ప్రతి వాహనానికి అదే నెంబర్ ఉండేలా జాగ్రత్తగా పడుతుంటారు.. తాజాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌ వాహనాలకు ఒకటే నెంబర్ ఉండడంపై ఆరా తీసిన ఆయన అభిమానులు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. విజయ్ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడిన ప్రతి కారుకు ఒకటే నంబరు ఉండడాన్ని ఇటీవల చాలామంది గమనించారు. ఆ నంబర్ 0277. అదుకు కారణమేంటంటే.. విజయకు తోడబుట్టిన చెల్లెలు ఉండేది. ఆ చెల్లెల పేరు విద్య. ఆమె ఫిబ్రవరి 14, 1977లో అనారోగ్యంతో చనిపోయింది. విజయ్ కి చెల్లెలు అంటే ఎంతో ఇష్టం. తన చెల్లెలు జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో పాటే గుర్తుండేలా ప్రతి వాహనానికి 0277 అనే నంబర్ను పెట్టుకుంటున్నారు విజయ్‌. ఫిబ్రవరి అంటే రెండవ నెల సో 2.. చనిపోయిన ఏడాదిలోని చివరి రెండు నెంబర్లు 77.. ఈ రెండింటిని కలిపి 0277 అనే నెంబర్ను తన కార్లకు రిజిస్ట్రేషన్ నెంబర్‌గా తీసుకుంటూ ఉంటాడు విజయ్‌. ఎన్నికల సమయంలో ఉపయోగించిన తన ప్రచార రథానికి కూడా ఇదే నెంబర్ ఉండేలా చూసుకున్నారు. గతంలో విజయ్ కారు నెంబర్ను పెద్దగా గమనించని వారందరూ ఇప్పుడు ఈ విషయం తెలిశాక గమనిస్తున్నారు. విజయ్‌ ఎమోషనల్ స్టోరీని తెలుసుకుని ఎమోషనల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??

రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు

బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్‌

Follow Us