Varanasi: వెయిట్ అండ్ సీ.. వారణాసి తర్వాత నెక్స్ట్ లెవల్‌లో మహేష్‌ స్ట్రాటజీ

Edited By:

Updated on: Aug 03, 2026 | 8:34 AM

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనే ఆసక్తి నెలకొంది. సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు సానా, ఆదిత్య ధర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గ్లోబల్ ఇమేజ్‌కు తగ్గ కథను ఎంచుకునే విషయంలో మహేష్ ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో సాగుతోంది.

రాజమౌళి వారణాసితో గ్లోబల్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు సూపర్ స్టార్ మహేష్‌ బాబు. మరి అంత భారీ ప్రాజెక్ట్ తరువాత మహేష్‌తో నెక్ట్స్ మూవీ చేయబోయే దర్శకుడు ఎవరు? అసలు నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మహేష్‌ స్ట్రాటజీ ఏంటి? టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు మహేష్‌తో టచ్‌లో ఉన్న దర్శకులెవరు..? డిటైల్డ్‌గా చూద్దాం పదండి. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం రాజమౌళి ప్రాజెక్ట్ పైనే ఉంది. వారణాసి పేరుతో రాబోతున్న ఈ సినిమాతో మహేష్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇదే నమ్మకంతో ఉన్న మహేష్‌ కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగు వేస్తున్నారు. తొందర పడి నిర్ణయం తీసుకోవటం కన్నా… వారణాసి రిలీజ్ వరకు వెయిట్ చేయటం బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే దర్శకులు మాత్రం మహేష్‌ కోసం బిగ్ స్కేల్ కథలతో రెడీ అవుతున్నారు. ఈ రేసులో అందరికంటే ముందు వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. మహేష్‌లోని మాస్ యాంగిల్‌ను నెక్స్ట్ లెవల్‌లో చూపించేందుకు వంగా ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసినట్లు టాక్. వీరిద్దరి కాంబో సెట్ అయితే మరోసారి బాక్సాఫీస్‌ షేక్ అవ్వటం ఖాయం అంటున్న ఇండస్ట్రీ జనాలు. ప్రజెంట్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, చాలా రోజుల కిందటే మహేష్‌ కాంబోకు సంబంధించిన హింట్ ఇచ్చారు. మహేష్‌ కూడా సందీప్‌తో సినిమా చేసేందుకు ఆల్మోస్ట్ ఓకే చెప్పేశారు. మరోవైపు బుచ్చిబాబు సానా కూడా మహేష్ కోసం ఒక ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ స్టోరీ లైన్ రెడీ చేశారన్నది ఇండస్ట్రీ టాక్‌. అటు బాలీవుడ్ మేకర్ ఆదిత్య ధర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ధురంధర్‌ సిరీస్‌తో కొత్త చరిత్ర సృష్టించిన ఆదిత్యధర్‌, సౌత్లో జెండా పాతేందుకు మహేష్‌ కాంబో కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. మహేష్ కూడా వారణాసి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తరువాత ఆదిత్యధర్‌ లాంటి దర్వకుడితో సినిమా చేస్తే ఆ హై అలాగే కంటిన్యూ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత హీరోలకు సక్సెస్ రాదన్న నెగటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేయడమే ఇప్పుడు మహేష్ ముందున్న బిగ్గెస్ట్‌ టాస్క్. అందుకే గ్లోబల్ ఇమేజ్‌కి తగ్గట్టుగా నెక్ట్స్ మూవీని చేసే దర్శకుడిని సెలెక్ట్ చేసేందుకు టైమ్ తీసుకుంటున్నారు సూపర్ స్టార్‌. మరి సూపర్‌ స్టార్‌ మహేష్‌, గ్లోబల్ స్టార్‌గా మారిన తరువాత ఆయన్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!

స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు

OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?

పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us