NTR – Ram Charan: ఇద్దర్లో ఎవరు గ్లోబల్ స్టార్..? తేలిపోవాలంతే.! వీడియో.
రెండు కళ్లలో ఏది గొప్పదంటే ఏం చెబుతాం? రెండు చేతుల్లో ఏదోటి కోరుకోవాలంటే ఏంది కోరుకుంటాం..? మన మనకవసరం లేని మన బాడీలోని ఓ ప్రధాన అవయవం చెప్పమంటే అసలు చెప్పగలమా? ఇది కూడా ఇంతే..!
రెండు కళ్లలో ఏది గొప్పదంటే ఏం చెబుతాం? రెండు చేతుల్లో ఏదోటి కోరుకోవాలంటే ఏంది కోరుకుంటాం..? మన మనకవసరం లేని మన బాడీలోని ఓ ప్రధాన అవయవం చెప్పమంటే అసలు చెప్పగలమా? ఇది కూడా ఇంతే..! నాన్ సింక్‌లో ఉన్నా కూడా.. చెర్రీ, తారక్ ఇద్దరిలో..! ఇద్దరూ గ్లోబల్ స్టార్సే..! స్టార్ హీరోలను డెమీ గాడ్స్‌లా.. గాడ్స్‌కు ఆల్టర్‌నేట్స్‌లా ఫీలయ్యే టాలీవుడ్‌లో.. ఫ్యాన్స్ ఎప్పుడూ తమ హీరోనే గొప్పంటూ… ఫీలవుతుంటారు. ఇంకో హీరో ఫ్యాన్స్‌తో వాదిస్తూ పోరాడుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో రెచ్చి పోయి మరీ.. తమ హీరోను ట్రెండ్ చేస్తుంటారు. దాంతో పాటే.. ఏ హీరో గొప్పంటూ.. పోల్స్ కూడా రన్ చేస్తుంటారు. అలా తాజాగా తారక్ అండ్ చెర్రీ మీద కూడా ఓ పోల్ రన్ చేస్తున్నారు మెగా అండ్ నందమూరి ఫ్యాన్స్.ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ నామ్ కమాయిచండంతో.. ఆస్కార్ అవార్డును కూడా గెలిచేయడంతో.. ఇప్పుడు తమ స్టారే గ్లోబల్ స్టార్ అంటూ హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు. హూ ఈజ్ ద గ్లోబల్ స్టార్ అంటూ.. ఇద్దరి ఫోటోలతో ఓ ఓపీనియన్ పోల్ రన్ చేస్తున్నారు. ఎవరు గ్లోబల్ స్టారో ఇప్పుడే తేలిపోవాలంటున్నారు.అయితే ఇదంతా గమనించిన కొంత మంది నెటిజన్లు మాత్రం.. లాజికల్ గా రియాక్టవుతున్నారు. ఇద్దరూ టాలీవుడ్ స్టార్లే అని.. ఇద్దరూ ట్యాలెంటెడ్ అండ్ చామింగ్ హీరోలని.. ఇద్దరూ ట్రిపుల్ ఆర్ సినిమాకు రెండు కళ్లలాంటోళ్లే అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ గ్లోబల్ స్టార్సే అని కొట్టుకుంటున్న ఫ్యాన్స్కు నచ్చజేప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!