సింగిల్ బ్యాంకు ఖాతాలోనే రూ. 213 కోట్లు.. అప్పులు జీరో..
తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇళయదళపతి విజయ్, తన అఫిడవిట్‌లో రూ. 624 కోట్ల ఆస్తులు ప్రకటించారు. ఇందులో రూ. 313 కోట్లు బ్యాంక్ ఖాతాల్లో నగదు రూపంలో ఉండటం విశేషం. భూములు, బినామీల పేరుతో దాచకుండా, మెజారిటీ సంపదను లిక్విడ్ క్యాష్‌గా ఉంచారు. అప్పులు లేకపోవడం ఆయన ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. టీవీకే పార్టీకి ఈ ఆర్థిక బలం విజయదుందుభి మోగించనుంది.
ఎవరూ ఊహించని విధంగా.. తమిళనాడులో ఇళయ దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. విజయ్ ఇక్కడ చాలా ముందే ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో విజయ్ తనకు రూ. 624 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఎక్కువగా తమ ఆస్తుల్ని భూములు, బినామీల రూపంలో దాచుకుంటుంటారు. కానీ విజయ్ మాత్రం.. మెజార్టీ వాటాను లిక్విడ్ క్యాష్ రూపంలో ఉంచుకోవడం విశేషం. చెన్నై సాలిగ్రామం బ్రాంచ్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లోని సేవింగ్స్ ఖాతాలో ఏకంగా రూ. 213 కోట్ల క్యాష్ ఉందని అఫిడవిట్‌లో చెప్పారు. మొత్తం తన ఆస్తిలో మూడింట ఒక వంతుకుపైగా ఇందులోనే ఉంది. సేవింగ్స్ అకౌంట్లో రూ. 213 కోట్లు కాకుండా అదనంగా 4 బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ. 100 కోట్ల వరకు ఆస్తి ఉంది. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో చూస్తే తన ఆస్తిలో సగం వరకు దాదాపు రూ. 313 కోట్లు బ్యాంకుల్లోనే ఉన్నాయి. వీటిల్లో వడ్డీ రూపంలో కచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. ఎలాంటి మార్కెట్ రిస్క్ లేదు. దీని వల్ల సంపద పెరుగుతూనే పోతుంటుంది. విజయ్ తన ఆస్తిలో ఎక్కువ భాగం బ్యాంకుల్లోనే దాచుకోగా.. రిస్క్ ఉండే ఈక్విటీల్లో స్వల్పంగా పెట్టుబడులు పెట్టారు. తన అఫిడవిట్ ప్రకారం.. ఈక్విటీల్లో.. స్టాక్ మార్కెట్ హోల్డింగ్స్ రూ. 19.37 లక్షల వరకు విలువ చేసే షేర్లు ఉన్నాయి. విజయ్ దగ్గర మంచి లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ. 13 కోట్లుగా ప్రకటించారు. తన పేరిట అప్పులు అసలేం లేవని విజయ్ చెప్పడం విశేషం. భారీ ఆస్తులు ఉన్న వారికి సాధారణంగా అప్పులు ఉంటాయని.. కానీ విజయ్‌కు అప్పులు లేకపోవడం ఆయన ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్.. సజ్జనార్ రియాక్షన్
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో ఇద్దరు వ్యక్తులు..
