విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?

Updated on: Mar 10, 2026 | 12:12 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం, తదనంతర వేడుకలు సోషల్ మీడియాలో నిత్యం చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఓ చిన్నారి అభిమాని తనను ఈ పెళ్లి వేడుకలకు ఎందుకు ఆహ్వానించలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ చిన్నారి అమాయక ప్రశ్నలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. విజయ్ దేవరకొండ త్వరలో ఆ చిన్నారిని కలిసే అవకాశం ఉంది.

ఒక చిన్నారి, తనను విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లికి పిలవలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే ‘విరోష్’ పెళ్లి వేడుక ముగిసినా, దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటూనే ఉంది. తాజాగా ఓ చిన్నారి అభిమాని ఈ స్టార్ జంటపై అలిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి అనంతరం విజయ్ దేవరకొండ తన సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతం నిర్వహించగా, ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పది రోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి ముచ్చట్లే వినిపించాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల స్వీట్లు పంపిణీ చేయడమే కాకుండా, దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కూడా చేసారు. స్వయంగా విజయ్ రష్మిక జంట కూడా అభిమానులతో కలిసి భోజనం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ వేడుకలన్నీ చూసిన ఒక చిన్నారి అభిమాని, తనను పెళ్లికి పిలవలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి తన క్యూట్ వాయిస్‌తో అడిగిన ప్రశ్నలు నెటిజన్లను ఆలోచింపచేయడమే కాకుండా నవ్వులు పూయించాయి. ‘విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు కదా.. మేం కూడా ఫ్యాన్స్‌మే కదా, మమ్మల్ని పెళ్లికి ఎందుకు పిలవలేదు? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు.. మేం కూడా మీ కోసం రీల్స్ చేస్తున్నాం కదా! మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట? ఈ వీడియో వారికి తెలిసేలా షేర్ చేయండి’ అంటూ ఆ చిన్నారి సూటిగా ప్రశ్నించింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మాది కూడా అదే ప్రశ్న చిన్ని తల్లి.. మమ్మల్ని కూడా పిలవలేదు’ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఆ చిన్నారి అమాయకత్వానికి ఫిదా అవుతున్నారు. ‘నువ్వు ఇప్పుడు వైరల్ అయిపోయావు కదా, త్వరలోనే వాళ్లే నిన్ను పిలుస్తారులే’ అంటూ బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ వీడియోను విజయ్, రష్మికల సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేస్తూ, ఆ చిన్నారిని కలవాలని కోరుతున్నారు. ఈ వీడియోపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలో చిన్నారిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రికెట్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. ధనా ధన్ లీగ్ వచ్చేసింది రోయ్.. మొదటి మ్యాచ్ ఎప్పుడంటే

అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే

మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

ఐస్‌క్రీం తినగానే నీళ్లు తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు

Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని

Follow Us